తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
== విజయనగర సైన్యం ఓటమికి కారణాలు ==
 
* హిందూ సైన్యములో వేగంగా కదిలే అశ్వాలు తక్కువ. మెల్లగా కదిలే ఏనుగులపై[[ఏనుగు]]లపై ముఖ్య సేనాధిపతులుండగా సుల్తానుల సైన్యములో [[పారశీక]] అశ్వములపై సుశిక్షుతులైన యోధులున్నారు. ఇది సహజంగా సుల్తానులకు లాభించింది.
* సుల్తానుల సేనాధిపతులు యువకులు కాగా విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసు మీరిన వారు -రామరాయలతో సహా.
* హిందూ సైనికుల వద్ద వెదురు బద్దలతో చేసిన ధనుస్సులుండగా ముస్లింలవద్ద లోహముతో చేసిన ధనస్సులున్నాయి. వీటివల్ల బాణములు వేగంగా, గురి తప్పకుండా ఛేదిస్తాయి.
* విజయనగర సైనికుల వద్ద ఏడు అడుగుల [[బల్లేలు]], [[ఈటెలూ]] ఉన్నాయి. సుల్తానుల అశ్వ సైనికుల వద్ద పదిహేను అడుగుల పొడవున్న బల్లేలున్నాయి.
* సుల్తానుల సైన్యములో తుర్కిస్తాన్ నుండి వచ్చిన సుశిక్షితులైన తుపాకిధారులుండగా విజయనగర సైన్యములో సరైన శిక్షణలేని [[యూరోపియను]] కూలి సిపాయిలు ఉన్నారు.
* అన్నింటికన్నా ముఖ్య కారణం, వేలాది హిందూ సైనికులకు నాయకత్వము వహించుతున్న జిలాని సోదరుల వెన్నుపోటు. గతంలో అదిల్ షా వద్దనుండి పారిపోయి వచ్చి రామరాయల ఆశ్రయము పొందిన ఈ సోదరులు కీలక సమయములో యుద్ధరంగాన్ని వదలి పోవటం <ref>History of South India, Prof. K.A.N. Sastri, pp 267 and Dr. S.U. Kamath, A Concise History of Karnataka, pp 172-73</ref>.
 
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు