కాకాని చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
కాకాని చక్రపాణి [[గుంటూరు జిల్లా]], [[మంగళగిరి]] సమీపంలో ఉన్న [[కాకాని]] గ్రామంలో [[1942]], [[ఏప్రిల్ 26]]వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు<ref name="వన్ ఇండియా">{{cite web|last1=వెబ్|first1=మాస్టర్|title=ప్రముఖ నవలా రచయిత కాకాని చక్రపాణి ఇక లేరు|url=http://telugu.oneindia.com/news/andhra-pradesh/novelist-kakani-chakrapani-passes-away-191784.html|website=వన్ ఇండియా|accessdate=3 January 2017}}</ref>. వీరు [[మంగళగిరి]] సి.కె.హైస్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి తిరుపతికి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి జీవితంలో ముఖ్య ఘట్టం. వీరు [[హైదరాబాద్]] లో [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]] ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఆంగ్ల బోధన వీరి వృత్తి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వీరి వ్యావృత్తి మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం వీరిది. స్నేహితులతో కబర్లంటే ఇష్టపడతారు. [[తెలుగు]] నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం అన్న అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టం పొందారు. ఆ పరిశోధనలో భాగంగానే మామ్ రాసిన ఆఫ్ హ్యూమన్ బాండేజ్ నవలను అనువదించారు. ఇటీవలే [[ద్రవిడ విశ్వవిద్యాలయము|ద్రావిడ విశ్వవిద్యాలయం]] కోసం [[రాజశేఖర చరిత్ర]], [[మైదానం]], [[చివరకు మిగిలేది]]. అల్పజీవినవలలను ఫోర్క్లాసిక్స్ ఆఫ్ తెలుగు ఫిక్షన్ పేరిట [[ఆంగ్లం]]లోకి అనువదించారు.<ref>[http://m.dailyhunt.in/Ebooks/telugu/kaakaani-chakrapaani-navalalu-1-book-121948 Kaakaani Chakrapaani Navalalu- 1 ( కాకాని చక్రపాణి నవలలు-1 )]</ref>
 
డా. కాకాని చక్రపాణి ఎన్నో నవలలు, వందలాది కథలు విమర్శ వ్యాసాలు రచించారు. కథలు, నవలలు, చరిత్ర గ్రంథాలు, [[ఇంగ్లీషు]] నుండి [[తెలుగు]]లోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనువదించారు. కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యం, బోలెడంత వాస్తవికత, మానవతావాదంతో కూడుకొని ఉంటాయి ఆయన సృజనాత్మకత రచనలు. <ref>[http://www.pustakam.org/telugu-books/kakani-chakrapani-navalalu-2.html కాకాని చక్రపాణి నవలలు -2 - Kakani Chakrapani Navalalu-2]</ref> ఆంధ్రభూమి దినపత్రికలో చాలా సంవత్సారాలు "కథలు - కాకరకాయలు" అనే శీర్షిక నిర్వహించారు<ref name="వన్ ఇండియా" />.
 
==కథలు==
"https://te.wikipedia.org/wiki/కాకాని_చక్రపాణి" నుండి వెలికితీశారు