కాత్యాయని విద్మహే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
కేతవరపు కాత్యాయనీ విద్మహే అభ్యుదయ రచయిత్రి.కాకతీయ .ఆమె రాసిన ‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు.ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి [[బండారు అచ్చమాంబ]], తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి [[వట్టికొండ విశాలాక్షి]], విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన [[రంగవల్లి]]కి అంకితం చేశారు.
 
కాకతీయ యూనివర్సిటీలో 1977లో అధ్యాపకురాలుగా ప్రవేశించి 1998సంవత్సరంలో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టారు.1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం సాహిత్య విమర్శ నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర 285 వరకు వ్యాసాలు రాశారు.275 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆమె మూడున్నర దశాబ్దాలుగా కాకతీయ వర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. కాత్యాయని వద్ద 11మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. ఆమె ‘తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయత’, [[‘తెలుగు]] నవలాకథానిక విమర్శ పరిణామం’, ‘ఆధునిక [[తెలుగుసాహిత్యం]] స్త్రీవాద భూమిక’ వంటి ఎన్నో రచనలు చేశారు. పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, రంగవల్లి స్మారక పురస్కార తదితర అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు. తన తండ్రి రామకోటిశాస్త్రి రాసిన సాహిత్య వ్యాసాలను 22వరకు పుస్తకాలుగా ప్రచురింపచేశారు. 1992నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది అక్టోబర్ 28న తనతండ్రి వర్థంతిరోజు తప్పనిసరిగా ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు.తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కాళోజీ, అల్లం రాజయ్య, పాల్కంపెల్లి శాంతాదేవి రచనలపై ఎంఫిల్ స్థాయి పరిశోధనలు, తెలంగాణ పోరాట నాటకంపై పీహెచ్‌డీ స్థాయి పరిశోధనలు కూడా చేయించారు. విప్లవ పోరాటాల ప్రభావంతో గళమెత్తిన స్త్రీల గురించి, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మూఢవిశ్వాసాలను ప్రశ్నిస్తూ వివిధ రచయిత్రుల రచనలను పరిచయం చేశారు.
 
కాత్యాయని ఇప్పటి వరకూ 20 పుస్తకాలు రాశారు. వాటిల్లో సాహిత్యాకాశంలో సగం, స్త్రీల కవిత్వం, కథ, అస్తిత్వ చైతన్యం, తదితర పుస్తకాలు అవార్డు పొందడానికి కారణమయ్యాయి. సాహిత్యాకాశంలో సగం పుస్తకంలో సుమారు 28 మంది మహిళా రచయితల వ్యాసాలను చేర్చారు. వీటితోపాటు వివిధ పుస్తకాలు, సాహితీ ధోరణులపై వెల్లడించిన సమీక్షలు, వివిధ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలను ఈ పుస్తకంలో పొందు పరిచారు.
 
ఆమె లింగ వివక్షకు వ్యతిరేకిస్తూ రచనలు చేయడం వల్లే అందరినీ ఆకర్షించగలిగారు. కాత్యాయని ఇంకా మహిళా సాధికారత - సవాల్, ఆధునిక తెలుగు సాహిత్యం - స్త్రీల భూమిక, లింగ సమానత్వం దిశగా సమాజ సాహిత్యం, [[కన్యాశుల్కం]] - సామాజిక సంబంధాలు, జెండర్ స్పృహ తదితర పుస్తకాలు ఆమె రాశారు.
 
సొసైటీ ఫర్ ఉమెన్ స్టడీస్ అండ్ డెవలప్ మెంట్, ప్రజాస్వామ్య రచయితల వేదిక (మహిళా రచయిత సంఘం) ఏర్పాటు చేశారు. ఆమెకు నేషనల్ బుక్ ట్రస్ట్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.<ref>[http://www.andhraprabha.com/andhra-pradesh/sahitya-akademi-award-for-katyayani/8233.html ఆంధ్రప్రభలో వ్యాసం]</ref>
"https://te.wikipedia.org/wiki/కాత్యాయని_విద్మహే" నుండి వెలికితీశారు