ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
[[బొమ్మ:Telugubookcover malapalli.JPG|right]]
 
[[రష్యా]]లో 1917లో జరిగిన బోల్షవిక్ [[విప్లవం]] వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ. కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణ నిచ్చింది [[రష్యా]] విప్లవమే. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి, వారి పక్షం వహించి, వారి దుస్థితిని తెలియ జేసిన మొదటి వైతాళికుడు ఉన్నవ.
 
సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కులవ్యవస్థను నిరసించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశాడు. అగ్రవర్ణాలు, [[హరిజనులు]] అందరూ కలసి మెలసి ఉండాలని భావించాడు . అందుకు నిరూపణగా " మాలపల్లి అనే విప్లవాత్మకమైన నవలా రచన చేశాడు. ఈ నవలకే రచయిత ' సంగ విజయం' అనే పేరు కూడా పెట్టాడు.