గుడిపాటి వెంకట చలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 174:
* ఈశ్వరుణ్ణి చూసినవారు లేరు. ఆఖరికి చూశామన్నవారు గూడా లేరు. ఈశ్వరుణ్ణి చూడలేదు అనేవారూ లేరు.-- ''(ఆత్మకథ 124 పుట నుండి)''
* ఈశ్వరుడు ఉన్నట్టు రూఢీగా తెలిస్తే నమ్మనా? అంతవరకు ఈశ్వరుడు లేనట్టూ రూఢీ లేదు మరి! ఉంటే నమ్మడానికి నాకేం అభ్యంతరం? --''(స్తీ 14వ పుట)''
*ఉన్నది దాచుకుంటాననేవాడికి దేవుడి భయం లేదు. నీది లాక్కుని పంచుతాననే వాడికి [[దేవుడు]] లేడు. అందుకనే, పశుబలం, యుక్తీ, తెలివీ ఇవే ప్రాబల్యంలోకి వచ్చాయి. ధర్మం, న్యాయం, సత్యం అనేవి ఉత్త మాయ మాటలైనాయి.(290 పుట మ్యూజింగ్స్ 5వ ముద్రణ)
*తనకు రావలిసిన హక్కులకన్న, తను నెరవేర్చవలసిన బాధ్యతల పైన దృష్టి నిలపాలి స్త్రీ. బైట ఉన్న పరిస్థితులకన్న, తన చుట్టూ ఉన్న వాతావరణం నించి కన్న స్వతంత్రమూ, శాంతీ, హృదయంలోపల పలికి వచ్చినప్పుడే స్థిరంగా నిలుస్తాయి అవి. అత్త అధికారంనించీ, భర్త అధీనం నుంచీ తప్పించుకుంటున్న నవీన స్త్రీ, షోకులకీ, సంఘ గౌరవానికీ, ఫాషిన్సికీ బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కిందనుంచుని (ఆ పురుషుడికి బానిస అయితేనేంగాక) లోకాన్ని ధిక్కరించగలిగే ఇల్లాలు, ఈనాడు సంఘ గౌరవం పేర, ఉద్యోగం పేర, ఫాషన్ పేర వెయ్యిమందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి - తనచుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు!-- ''(స్త్రీ 16వ పుట)''
* తెల్లారి లేస్తె పిడకలు, మళ్ళు (పాతకాలంలో బ్రాహ్మణ స్త్రీలు మడి కట్టుకునేవారు), అధికారాలు, అలుకులు(పూర్వం ఇల్లు పేడతో అలుక్కునేవారు) ఇవన్నీ వొదిలి, సూర్యోదయం చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం ఉత్సాహం - ఎప్పుడు కలుగుతుంది మానవులకి!...''(స్త్రీ 17వ పుట)''
"https://te.wikipedia.org/wiki/గుడిపాటి_వెంకట_చలం" నుండి వెలికితీశారు