మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, ని → ని , గా → గా , గ్రంధా → గ్రంథా, → using AWB
పంక్తి 41:
ఆయన [[1949]], [[నవంబర్ 13]] న [[విజయవాడ]]లో జన్మించాడు.<ref>http://www.telugucinema.com/c/publish/starsprofile/malladivkm.php</ref> మల్లాది శారదాంబ, మల్లాది దక్షిణామూర్తి ఆయన తల్లిదండ్రులు. వారి కుటుంబంలో ఆయన ఏడో సంతానం. 1969 లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుంచి పట్టభద్రుడైన ఆయన 1972 వరకు వివిధ ప్రైవేటు సంస్థల్లో పనిచేసి, [[హైదరాబాదు]] లోని ప్రభుత్వ అడిట్ కార్యాలయంలో ఆడిటరుగా చేరాడు. 1986 లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రచయితగా మారాడు. ఎందరో సంపాదకులు, మల్లాది చిత్రాన్ని, తమ పత్రికలలో ప్రచురిస్తామన్న అభ్యర్దనకు, రచయిత తన అంగీకారమివ్వనందువలన, మల్లాది ఛాయాచిత్రం ఇంతవరకూ ఎక్కడా ప్రచురితం కాలేదు.
 
మల్లాది రచయిత అవడానికి ప్రధాన ప్రేరణ ఆయన బాల్యంలో చదివిన అనేకానేక పత్రికలూ, నవలలు. ఆయనకు ఏడుగురు అక్కలు. వాళ్ళందరికీ పత్రికా పఠనం అంటే ఎంతో ఆసక్తి. వారి అమ్మ [[మల్లాది శారదాంబ]] [[ఆంధ్ర ప్రభ]] వీక్లీ కొనేది. వారి పక్కింటివాళ్ళు [[ఆంధ్ర పత్రిక]]ని కొనేవారు. వాటిని వారు ఎక్సేంజ్ చేసుకుని చదువుకునేవాళ్ళు.ఆ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళు ఈపద్ధతిని అనుసరించేవారు. ఇలా ఏడో ఏటనించే ఆయన తెలుగు పుస్తకాలు చదవడం ఆరంభించారు. సాయంత్రాలు ఆయన వారి ఇంటికి ఐదు నిముషాల నడక దూరంలో వున్న గాంధీనగర్లోని ఓ లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలని చదివేవారు. అది నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఎస్ కే పీ వీ వీ స్కూల్ సమీపంలో వుండేది. ప్రస్తుతం అది లేదు.
 
ఆయనకు గల సాహిత్య జ్ఞాపకాలలో ఒకటి [[దీపావళి]]కి [[ఆంధ్ర ప్రభ]], [[ఆంధ్ర పత్రిక]]ల ప్రత్యేక సంచికలు. ఎక్కువ పేజీలతో, కునేగా మరికొలందు సెంటుతో ఘుమ ఘుమలాడుతూ వచ్చేవి అవి. వాటిని చదవడానికి వారి కుటుంబ సభ్యులంతా పోటీ పదే వారు. ఆనాటి చాలామంది పాఠకులకి కూడా ఈ అనుభవం వుండి వుంటుంది. బహుమతి పొందిన కథలని చదివేసాక ఇక వాటి మీద ఆసక్తి తగ్గేది. అలాగే [[యువ]], [[జ్యోతి]] మాస పత్రికలూ [[దీపావళి]], [[సంక్రాంతి]] పండగలకి ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ప్రముఖ రచయితల కథలు వుండేవి. [[అవసరాల రామకృష్ణారావు]], [[ఇచ్ఛాపురపు జగన్నాథరావు]], [[భరాగో]], [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]],[[ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు|ఆదివిష్ణు]] తదితరుల కథలు వాటిలో వచ్చేవి.