వీటూరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, లొ → లో (2), లో → లో , మహ → మహా, → (69), , → , (11) using AWB
పంక్తి 38:
'''వీటూరి''' నాటకాల రచయిత. ఇతని పూర్తిపేరు '''వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి'''. "కల్పన" అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యాడు.ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి, తానుగా పద్యాలు రాయడం ఆరంభించారు. తన పద్యాల్ని పత్రికలకు పంపడం, కవి సమ్మేళనాల్లో వినిపించడం చేసేవారు. పౌరాణికాలతో ఆగకుండా, సాంఘిక నాటకాలు కూడా రాశారు. తను రాసిన పురాణ నాటకాలకు తనే, హార్మోనీ వాయించేవారని అనేవారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాలల్లో తెలుగు బోధించేవారు.
==బాల్యం==
ఇతడు [[1934]],[[జనవరి 3]]వ తేదీన జన్మించాడు. ఇతని జన్మస్థలం [[విజయనగరం]] జిల్లా [[పూసపాటిరేగ]] మండలం, [[రెల్లివలస (పూసపాటిరేగ)|రెల్లివలస]] గ్రామం<ref>{{cite news|last1=పైడిపాల|title=రాగాలతోట వీటూరిపాట|url=http://epaper.andhrajyothy.com/detailednews?box=Li4vRmlsZXMvMjAxNTAxMDMwMTAzMDMzMTI1NDU0LmpwZw==&day=20150103|accessdate=3 January 2015|work=ఆంధ్రజ్యోతి దినపత్రిక|date=03/01/2015}}</ref>. తన 12వ ఏట నుండే కవితలు రాయడం మొదలుపెట్టాడు వీటూరి. [[భీమిలి]]లో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసి కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్వయంకృషితో తెలుగు భాషపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. [[హార్మోనియం]] వాయిస్తూ పాటలు పాడేవాడు. ఈ ఉత్సాహమే అతనిచేత నాటకాలు రాయించింది. పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక మొదలైన నాటకాలు రాశాడు వీటూరి. ఆయనే సొంతంగా నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశాడు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన సన్మానసభలో వీటూరిని ‘తరుణ కవి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. వీటూరి పేరుతోనే కాకుండా జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతో [[ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రప్రభ]] మొదలైన పత్రికల్లో కథలు రాశాడు.
 
==సినీ రచయితగా==
"https://te.wikipedia.org/wiki/వీటూరి" నుండి వెలికితీశారు