తెన్నేటి హేమలత: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
==జీవితం==
నవంబరు 15, 1935 న [[విజయవాడ]]లో నిభానుపూడి విశాలాక్షి మరియు నారాయణరావు దంపతులకు జన్మించారు. ఆమెకు జానకి రమాకృష్ణవేణి హేమలత అని నామకరణం చేసారు. ఐదవ తరగతి వరకూ బడిలో చదువుకుని, ఆపైన [[తెలుగు]], [[సంస్కృతం]] మరియు [[ఆంగ్లం]] ఇంటి వద్దనే చదువుకున్నారు. తొమ్మిదోయేట ఆమెకు తెన్నేటి అచ్యుతరామయ్యతో [[వివాహం]] జరిగింది. ఆ సమయానికి అతడు ఆమెకన్నా ఏడేళ్ళు పెద్దవాడు మరియు ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారు. ఈమె తండ్రి తన 32వ యేట మరణించేరు. అప్పటికి లతకి ఒక తమ్ముడు. ఆ తమ్మునిభారం తాను వహిస్తానని తండ్రికి మాట ఇచ్చేరామె ఆయన మరణసమయంలో.
1955లో విజయవాడలోని[[విజయవాడ]]లోని [[ఆకాశవాణి|ఆకాశవాణి కేంద్రం]] నుండి అనౌన్సర్ గా ఈవిడ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. మొదట్లో [[రేడియో నాటకాలు|రేడియో నాటకాల్లో]] పనిచేసి ఆపై సినిమాలలో కూడా నటించి, [[మాటలు]] వ్రాయటం మొదలుపెట్టారు. ఈవిడ మొదటి రేడియోనాటకం ''శిలాహృదయం'' (రాయి లాంటి మనస్సు). ఇది 1952 లో [[డెక్కన్ రేడియో]]లో ప్రసారం చేసారు. ఈమె [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] అభిమాని, ఆయన [[సంగీతం]] కూర్చిన కొన్ని రాగాలకు సాహిత్య రచన కూడా చేసారు.
భర్త ఆరోగ్యం క్షీణించడం ఒక పక్క, మరో పక్క ఇద్దరు పిల్లలు (మొదటి కొడుకు తెన్నేటి నారాయణరావు 1956 లో, రెండో కొడుకు తెన్నేటి మోహనవంశీ 1963 లో) [[సిజేరియన్ ఆపరేషన్]] ద్వారా పుట్టడంతో తీవ్రమయిన మానసిక క్షోభకు గురై, అదే విధంగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. జీవితంలో మొదటి నుండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడానని ('''అంతరంగ చిత్రం''') లో ఆవిడ చెప్పుకున్నారు. 1997 లో 65 యేట ఆమె కన్ను మూసారు.
 
"https://te.wikipedia.org/wiki/తెన్నేటి_హేమలత" నుండి వెలికితీశారు