పి.సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

+కోల్లెజ్ లింకు
పంక్తి 38:
'''పి.సత్యవతి''' ప్రఖ్యాత తీలుగు కథా రచయిత్రి.
==జీవిత విశేషాలు==
'''పి.సత్యవతి''' [[1940]] జూలైలో [[గుంటూరు జిల్లా]], [[కొలకలూరు]]లో జన్మించారు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వకళాపరిషత్]] లో ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. [[విజయవాడ]] ఎస్.ఎ.ఎస్.కళాశాలలోలో ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవి విరమణ చేశారు. పాఠాలు బోధించడం, [[ఇంగ్లిషు]] సాహిత్యం గురించే కావచ్చు కానీ, ఆమె పరిశీలించిన [[సమాజం]] తెలుగుది. అందుకే ఆమె రచనలను తెలుగు సాహిత్యంలోనే చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను శ్రద్ధగా ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసిన సత్యవతిగారు సమాజ గమనాన్ని అంతకంటే నిశితంగా పరిశీలించారనడానికి ఆమె రాసిన కథలూ, వెలువరించిన కథాసంపుటాలూ, అరుదుగానైనా అప్పుడప్పుడూ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు స్పష్టమైన నిదర్శనాలు.
 
సమాజ గమనాన్ని, సాహిత్య బాధ్యతను గుర్తెరిగిన సత్యవతిగారు కథారచనలో ఒక నిర్దిష్ట గమ్యాన్ని నిర్ధారించుకున్నారు. ఆ బాటలోనే 1970 నుంచి కథారచన చేస్తూ తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దారిలో తనకెదురైన పాఠకులను నిరంతరం ప్రమత్తం చేస్తున్నారు. ఆ రంగం వనితాలోకం. ఆ మార్గం మహోన్నత మహిళామార్గం. పితృస్వామ్య సమాజంలో మహిళలకున్న కష్టాలకంటే వారే కొని తెచ్చుకుంటున్న కష్టాలు ఎక్కువైతే, సమాజం వారిమీద బలవంతంగా రుద్దే పీడన, అపచారాలు, అవమానాలకు అంతేలేదు. ఈ ముప్పేట దాడిని సమర్ధంగా ఎదుర్కోవాలంటే జరుగుతున్న దోపిడీ స్వరూపాన్ని, దోచుకునే విధానాలను ఎండగట్టాలి. వివక్ష విశ్వరూపాన్ని ప్రదర్శింపజేయాలి. ఆ బృహత్తర బాధ్యతను చిత్తశుద్ధితో తలకెత్తుకున్న స్త్రీవాద రచయితలలో పి. సత్యవతి అగ్రగణ్యురాలు.
"https://te.wikipedia.org/wiki/పి.సత్యవతి" నుండి వెలికితీశారు