తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== యుద్ధ వివరణ ==
నలుగురు సుల్తానులు తమ సైన్యాలను [[బీజాపూరు]] సమీపంలోని ఒక మైదాన ప్రాంతంలో కలిపారు. [[1564]] [[డిసెంబర్ 25]]న ఈ కూటమి సైన్యాలు దక్షిణ ముఖంగా ప్రయాణించి కృష్ణకు[[కృష్ణ]]కు 25 మైళ్ళ దూరంలోని [[తళ్ళికోట]] గ్రామం వద్దకు చేరుకున్నాయి. కూటమి సైన్యాలు చాలా రోజుల పాటు అక్కడే విడిది చేశాయి.
 
అక్కడ విజయనగరములో రామరాయలు కూడా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. తన తమ్ముళ్ళు [[తిరుమల రాయలు]], వెంకటాద్రి రాయలుల సమేతంగా కృష్ణకు దక్షిణ భాగాన రాక్షసి, తంగడి గ్రామాల మధ్యన సైన్యాన్ని మోహరించాడు. సుల్తాను సైన్యం నదిని దాటే అవకాశం గల అన్ని చోట్ల కాపలాను, పహారాను ఏర్పాటు చేశాడు.
 
అయితే సుల్తానుల సైన్యం నది దిగువగా ప్రయాణం చేస్తున్నట్లుగా రామరాయల సైన్యాన్ని నమ్మించి, ఒకరాత్రి వేళ నదిని దాటడం ప్రారంభించింది. తెల్లవారేసరికి సైన్యమంతా దక్షిణ తీరానికి చేరుకుంది. ఆ మరుసటి రోజున - [[1565]] [[జనవరి 23]] (యుద్ధం జరిగిన తేదీని ఫరిష్తా [[జనవరి 23]] గా గుర్తించాడు. రాబర్ట్ సెవెల్ కూడా తన పుస్తకంలో అదే తేదీని తీసుకున్నాడు.) - రెండు పక్షాల సైన్యాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. రెండు వైపులా సైన్యం లక్షల్లో ఉంది. రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమ వైపున తిరుమల రాయలు ఆలీ ఆదిల్‌షాను, మధ్యన రామరాయలు హుసేన్ నిజాంషాను, కుడివైపున వెంకటాద్రి రాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, ఆలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్ధ వ్యూహ రచన చేశాడు. దక్కన్ సుల్తానుల కూటమి సైన్యం ఫిరంగులను మోహరించింది. ఈ ఫిరంగులను కప్పిపుచ్చుతూ రెండువేలమంది సైనికులు విజయనగర సైన్యంపై బాణాల వర్షం కురిపించారు. విజయనగర సైన్యం వీరిపైకి దాడి చేసే సమయానికి వీరు లాఘవంగా తప్పుకుని ఫిరంగులకు దారినిచ్చారు. విజయనగర సైన్యం సరిగ్గా ఫిరంగులకు ఎదురుగా వచ్చింది. హఠాత్తుగా మొదలైన [[ఫిరంగి]] దాడులతో విజయనగర సైన్యం వెనకడుగు వేసింది.
 
పల్లకీ ఎక్కి పర్యవేక్షిస్తున్న రామరాయలు పల్లకీ దిగి ఒక ఎత్తైన సింహాసనమెక్కి [[బంగారు]] నాణేలు విరజిమ్ముతూ సైన్యాన్ని ఉత్సాహపరచాడు. విజయనగర సైన్యం కూడా కూటమి సైన్యంపై దాడులు చేసి బాగా నష్టం కలిగించడంతో కూటమి సైన్యం వెనక్కు కొంచెం తగ్గింది. మధ్యభాగంలోని కూటమి సైన్యం ఫిరంగులలో రాగి నాణేలను కూరి విజయనగర సైన్యంపై పేల్చింది. ఈ రాగి నాణాల దాడికి వేలాది సైనికులు బలయ్యారు. సైన్యం అంతా చెల్లాచెదురయింది. ఈ హడావుడిలో రామరాయలు గద్దె దిగి, మళ్ళీ పల్లకి ఎక్కబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఫిరంగుల మోతలకు బెదిరిన కూటమి సైన్యంలోని ఓ [[ఏనుగు]] పరిగెత్తుకుంటూ రామరాయల పల్లకీ వైపు వచ్చింది. అదిచూసి భయపడిన బోయీలు పల్లకీని వదిలేసి పరుగెత్తారు. కిందపడిపోయిన రామరాయలు తేరుకుని లేచి గుర్రమెక్కేలోగా హుసేన్ నిజాం షా సైన్యం రామరాయలను పట్టుకుని బంధించి, సుల్తాను ముందు హాజరు పరచింది. హుసేన్‌షా స్వయంగా రామరాయల తల నరికి యుద్ధభూమిలో పైకెత్తి ప్రదర్శించాడు.
 
తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కి, నగరానికి పారిపోయాడు. రామరాయల కుమారుడు తన బంధువులతో సహా [[ఆనెగొంది]] నుండి మూడు కోసుల దూరములో ఉన్న ఒక లోతైన గుహలో తలదాచుకున్నాడు.<ref>Krishnaswami Aiyangar et.al,(2000) పేజి.254</ref>
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు