వాసిరెడ్డి సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==జీవిత సంగ్రహం==
ఈమె [[గుంటూరు]] జిల్లా [[చేబ్రోలు]]లో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య మరియు రంగనాయకమ్మ. చిన్నతనంలోనే [[చెన్నై]] చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, [[ప్రవీణ]], [[సాహిత్య రత్నలోరత్న]]లో ఉత్తీర్ణులయ్యారు. [[నాగపూర్ విశ్వవిద్యాలయం]] నుండి బి.ఎ. మరియు ఎమ్.ఎ. పూర్తిచేశారు. ఈమె రచించిన మొదటి నవల ''జీవితం అంటే'' (1950) మరియు తొలి కథ ''సాంబయ్య పెళ్ళి'' (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా [[నవల]]లు మరియు 100 పైగా [[కథ]]లు రచించారు.
 
ఈమె [[నక్సలిజం]] గురించి [[1982]] సంవత్సరంలో రచించిన ''మరీచిక'' నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత [[ఆరుద్ర]] వంటి సాహిత్యకారుల అభిప్రాయాలపై [[హైకోర్టు]] కేసు కొట్టివేసి నిషేధాన్ని తొలగించింది. ఈమె రచించిన ''మట్టి మనిషి'' (2000) నవల 14 భాషలలోకి అనువదించబడింది.
పంక్తి 45:
ఈమె నవలల్లో కొన్ని [[తెలుగు సినిమా]]లుగా మరికొన్ని దూరదర్శన్ సీరియల్లుగాను నిర్మించబడ్డాయి. సమత నవల ఆధారంగా [[ప్రజా నాయకుడు]], ప్రతీకారం నవలను [[మనస్సాక్షి]] సినిమాగా, మానినీ మనసును [[ఆమె కథ]] సినిమాలుగా వచ్చాయి. [[మృగతృష్ణ]] నవలను అదే పేరుతో సినిమాగా నిర్మించారు.
 
ఈమె [[జవహర్ బాలభవన్]] డైరెక్టర్ గా పనిచేశారు. ఈమె [[1985]] - [[1991]] మధ్యకాలంలో [[ఫిల్మ్ సెన్సార్ బోర్డు]] సభ్యురాలిగా సేవలందించారు.
 
ఈమె సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు [[1998]] సంవత్సరంలో ఘనంగా నిర్వహించారు.