తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , పటిష్ట → పటిష్ఠ, నేపధ్య → నేపథ్య, గ్రంధా → using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తెలుగు శాసనాలు}}
అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే [[తెలుగు]] అక్షరాలు రూపొందినా యనిపిస్తుంది.<ref name="parabrahma">'''తెలుగు శాసనాలు''' - రచన: జి. పరబ్రహ్మశాస్త్రి - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు (1975) [http://www.archive.org/details/TeluguSasanalu ఇంటర్నెట్ ఆర్చీవులలో లభ్యం]</ref> కుబ్బీరకుని [[భట్టిప్రోలు]] శాసనము, [[అశోకుడు|అశోకుని]] [[ఎఱ్ఱగుడిపాడు శాసనము|ఎఱ్ఱగుడిపాడు]] (జొన్నగిరి) గుట్టమీది శాసనము [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.
 
తరువాత అమరావతిలోని '''నాగబు''' అనే పదము (క్రీ.శ. 1వ శతాబ్ది), విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ [[సంస్కృత]] శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (క్రీ.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి [[తెలుగు]] పదాలు. [[నాగార్జునకొండ]] వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.<ref name="parabrahma"/>
 
6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో [[రేనాటి చోడులు]] సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం.<ref name="bsl">'''ఆంధ్రుల చరిత్ర''' - రచన: ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2003)</ref> వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో [[ధనంజయుని కలమళ్ళ శాసనం]] (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది క్రీ.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.<ref name="parabrahma"/>
 
ఆ తరువాత [[జయసింహవల్లభుని విప్పర్ల శాసనము]] క్రీ.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో [[ప్రాకృత]] భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి [[పండరంగుని అద్దంకి శాసనము]]లో ఒక [[తరువోజ]] [[పద్యము|పద్యమూ]], తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి [[యుద్ధమల్లుని బెజనాడ శాసనము]]లో ఐదు [[సీసము|సీస]] పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న [[విరియాల కామసాని గూడూరు శాసనము]]లో మూడు [[చంపకమాల]]లు, రెండు [[ఉత్పల మాల]]లు వ్రాయబడ్డాయి.<ref name="divakarla">దివాకర్ల వేంకటావధాని - '''ఆంధ్ర వాఙ్మయ చరిత్రము''' - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) [http://www.archive.org/details/andhravajmayacha025952mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref> వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.
===ధనంజయుని కలమళ్ళ శాసనము===
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు