ఇల్కాల్ చీర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
చీర మధ్యభాగం వార్పు మరియు కుచ్చిళ్ల వార్పు కలిసే ప్రాంతంలో ఉన్న ఉచ్చుల వరుసలను స్థానికంగా TOPE TENI టెక్నిక్ అని పిలుస్తారు. ఈ టెక్నిక్ చీర ప్రత్యేక లక్షణం. . ఈ టెక్నిక్ ఇల్కాల్ లో మాత్రమే ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎవరికైనా ఇల్కాల్ చీర అవసరం ఉంటే ఒక ప్రతి చీరకు ఒక వార్ప్ సిద్ధం చేయాల్సివుంటుంది. చీర మధ్యభాగం కోసం నిలువు దారాలను విడిగా తయారుచేస్తారు. అదేవిధంగా కుచ్చిళ్ల భాగంకోసం నాణ్యత అవసరాన్ని బట్టి మామూలు పట్టుతో లేదా స్వచ్ఛమైన పట్టు తో గాని విడివిడిగా తయారుచేస్తారు. మూడవభాగమైన బార్డర్ కోసం కుచ్చిళ్లకు ఉపయోగించిన వార్పుగాని, మామూలు పట్టుగాని లేదా స్వచ్ఛమైన పట్టుగాని ఉపయోగిస్తారు. రంగు విషయంలో ఒక్కోసారి కుచ్చిళ్లకు వాడిన రంగునే బార్డర్ కు కూడా వాడుతారు. సాధారణంగా, కుచ్చిళ్ల పొడవు 16 నుండి 27 అంగుళాల పొడవులో ఉంటుంది. కుచ్చిళ్ల దారాలు మరియు చీర మధ్యభాగపు దారాలు ఉచ్చులు (లూప్) టెక్నిక్ తో కలుపబడి ఉంటాయి. ఈ పద్ధతిని స్థానికంగా TOPE TENI టెక్నిక్ అని పిలుస్తారు.
== లక్షణాలు ==
ఇల్కాల్ చీరల యొక్క ప్రత్యేకమైన విలక్షణం ప్రత్యేక [[ఎంబ్రాయిడరీ]] కలిగివుండడమే. ఈ రకమైన ఎంబ్రాయిడరీని కసూటి అని పిలుస్తారు. ఇల్కాల్ చీరలపై వేసే కసూటి ఎంబ్రాయిడరీలో ఉపయోగించే డిజైన్లు [[ఏనుగులు]] మరియు కమలాల వంటి సంప్రదాయ నమూనాలను ప్రతిబింబిస్తాయి. ఇల్కాల్ చీరలు సాధారణంగా 9 గజాల పొడవు ఉంటాయి. కొంగు భాగం (భుజం మీద ధరించే భాగం) లో ఆలయ గోపురాల నమూనాలు ఉంటాయి<ref name="story" />. వీటిని ఎరుపు పట్టుతో తెలుపు నమూనాలతో తయారు చేస్తారు<ref name="ilkal" />. కొంగు చివరి భాగాన్ని [[దువ్వెన]], [[కోట ప్రాకారాలు]], [[జొన్నలు]] మరియు పర్వత శ్రేణి వంటి వివిధ ఆకారాలు యొక్క నమూనాలతో తయారుచేస్తారు. చీర బార్డర్ (4 నుండి 6 అంగుళాలు) ఎరుపు లేదా ముదురు మరియు జేగురు రంగులతో వివిధ రకాల నమూనాలు తయారు చేస్తారు. ఇల్కాల్ చీరలు కాటన్ (పత్తి)తో గాని లేదా [[పత్తి]] మరియు [[పట్టు]] లేదా స్వచ్ఛమైన పట్టు మిశ్రమంతో తయారవుతాయి. ఈ చీరల తయారిలో [[దానిమ్మ]] [[ఎరుపు]], ఉజ్వల నెమలి [[ఆకుపచ్చ]] మరియు చిలుక ఆకుపచ్చ వంటి సాంప్రదాయక రంగులు ఉపయోగించబడతాయి. [[పెళ్లికూతురు]] కోసం తయారుచేసే చీరలను గిరి కుంకుం అని పిలిచే ఒక ప్రత్యేకమైన రంగుతో తయారు చేస్తారు. ఇటువంటి చీరలను ఈ ప్రాంతంలో పూజారుల భార్యలు ధరిస్తారు<ref name="ilkal" />.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్కాల్_చీర" నుండి వెలికితీశారు