అంబటిపూడి వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
===ఉద్యోగము, సంఘసేవ===
[[నల్లగొండ]] జిల్లా [[చుండూరు]] గ్రామం చేరుకుని అక్కడ విద్య బోధించేవాడు. ఇతడు ఎందరో శిష్యులను తీర్చిదిద్దాడు. దరిద్ర నారాయణ సంఘమును స్థాపించి అన్నదానము, వస్త్రదానము చేసి ఆచరణతో కూడిన ఆదర్శమును ప్రదర్శించాడు. [[కస్తాల]] గ్రామంలో విద్యానాథ గ్రంథాలయమును స్థాపించాడు. అట్లే చుండూరులో[[చుండూరు]]లో [[ఆంధ్రరత్న]] పఠనమందిరమును ప్రారంభించాడు. [[హరిజన]] పాఠశాలను నెలకొల్పాడు. మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశాడు. ఇతడు కొంతకాలం నల్లగొండలోని[[నల్లగొండ]]లోని గీతావిజ్ఞానాంధ్ర కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.
 
===సాహిత్య సేవ===
1934వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో [[సాహితీమేఖల]] అనే సంస్థను స్థాపించాడు. సాహిత్య వ్యాప్తికి దోహదం చేసే ఎందరో కవిపండితులకు ప్రేరకశక్తిగా నిలిచాడు. ఎన్నో వ్యాసాలు, కావ్యాలు, నాటకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు, ఆంగ్ల గ్రంథాలు రచించాడు.