అట్టాడ అప్పల్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డూ. → డు., యుద్దం → యుద్ధం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
| weight =
}}
'''అట్టాడ అప్పల్నాయుడు''' ఉత్తరాంధ్రకు[[ఉత్తరాంధ్ర]]కు చెందిన కథా, నవలా రచయిత. ఇతడు [[విజయనగరం]] జిల్లా, [[కొమరాడ]] మండలం [[గుమడ]] గ్రామంలో [[1953]]వ సంవత్సరం [[ఆగష్టు 23]]వ తేదీన జన్మించాడు.<ref>{{cite journal|last1=లాంగుల్య|title=నవ్యనీరాజనం|journal=నవ్యవీక్లీ|date=13-10-2010|pages=27-29|url=http://www.navyaweekly.com/2010/oct/13/page27.asp|accessdate=20 December 2014}}</ref> [[కొతిపం|కోటిపాం]] జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. జననాట్యమండలిలో[[జననాట్యమండలి]]లో పనిచేశాడు. [[పార్వతీపురం]]లో ఇంటర్‌మీడియెట్ చదివాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పనిచేశాడు. నాగావళి వారపత్రికలో పనిచేశాడు. తరువాత [[బ్యాంక్]] ఉద్యోగం సంపాదించుకున్నాడు.
==శ్రీకాకుళ సాహితి==
ఇతడు తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించాడు. ప్రతి నెల సభలు, సమావేశాలు నిర్వహించాడు. జముకు అనే బులెటిన్‌ను ఈ సంస్థ తరఫున తీసుకువచ్చాడు. నాగావళి కథలు, వంశధార కథలు, జంఝావతి కథలు మొదలైన కథాసంకలనాలను సంస్థ తరఫున ప్రచురించాడు.
==రచనలు==
ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో కథలు వ్రాసేవాడు. ఇతని రచనలు సృజన, [[అరుణతార]], అంకితం, [[ప్రజాసాహితి]], [[ఇండియాటుడే]], [[ఆంధ్రజ్యోతి]], [[ఆంధ్రప్రభ]], పుస్తకం, యువత మందస, [[విపుల]], ఆహ్వానం, [[వార్త]], నూతన, [[ప్రజాశక్తి]], ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, [[స్వాతి]] మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా '''అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం''' అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది.
===కథలజాబితా<ref>{{cite web|last1=అట్ట్డాడ|first1=అప్పల్నాయుడు|title=అట్టాడ అప్పలనాయుడు కథలు|url=http://www.kathanilayam.com/writer/3139|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=20 December 2014}}</ref>===
{{Div col|cols=2}}