ఆదుర్తి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
'వనరాణి', 'మంగళ సూత్రం', 'ఒక రోజు రాజ', 'సర్కస్ రాజు' చిత్రాలకు [[మాటలు]], [[పాటలు]] రాసారు. ఆనాడు సంచలనం రేపిన ప్రముఖ నాట్యాచార్యుడు [[ఉదయ శంకర్]] నాట్యం ప్రధానాశంగా తాను తీస్తున్న 'కల్పన' చిత్రానికి సహాయ దర్శకుడిగా ఆదుర్తి గారిని తీసుకున్నారు.ఆ చిత్ర నిర్మాణం కోసం ఆయన బొంబాయి నుండి మద్రాసుకి చేరారు. ఆ సమయంలోనే మచిలీపట్నానికి చెందిన కామేశ్వరీ బాలతో ఆయనకు వివాహం జరిగింది. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించారు. అది ఎక్కువకాలం నడవలేదు.
 
కె.ఎస్. ప్రకాశరావు గారు నిర్మించిన ' [[దీక్ష]] ' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి ప్రకాశరావు గారి ప్రశంసలకు పాత్రులయ్యారు. 'సంక్రాంతి', 'కన్న తల్లి' చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. [[ప్రకాశరావు]] గారి 'బాలానందం' చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడుగా పనిచేశారు.
ప్రకాష్ స్టూడియోలో పనిచేసిన డి. బి. నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో వారితో కలిసి సాహిణీ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి 'అమరసందేశ ' అనే చిత్రాన్ని తన దర్శకత్వంలో నిర్మించారు. 1954 లో విడుదలైన ఆ చిత్రమే ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో ఆయన చూపించిన ప్రతిభ అన్నపూర్ణ పిక్చర్స్ లో ఆయన ప్రవేశానికి నాంది అయింది. ఆ సంస్థకు తొమ్మిది తెలుగు చిత్రాలు, మూడు [[తమిళ]] చిత్రాలు రూపొందించారు.
తమిళ నిర్మాత సి. సుందరంతో కలిసి బాబూ మూవీస్ సంస్థను స్థాపించి '[[మంచి మనసులు (1962 సినిమా)|మంచి మనసులు']], '[[మూగమనసులు]]', '[[తేనెమనసులు]]', '[[కన్నె మనసులు]]' చిత్రాలు నిర్మించారు. 'తేనె మనసులు' తెలుగులో[[తెలుగు]]లో మొదటి సాంఘిక రంగుల చిత్రం. అంతే కాదు అందరూ కొత్త నటీనటులతో తీసిన మొదటి చిత్రమని కూడా చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ణకు హీరోగా మొదటి చిత్రం. మొదట ఆరు రీళ్ళు నలుపు తెలుపులో తీసి నచ్చక మళ్ళీ రంగుల్లో తీసారు. ఆ చిత్రం సంచలనం సృష్టించింది.
 
ఆయన హిందీలో 'మిలన్' (మూగమనసులు), 'డోలీ' ([[తేనెమనసులు]]), 'జ్వార్ భలా' (దాగుడు మూతలు), ' మన్ కా మీత్ ' లాంటి సుమారు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'దర్పణ్', 'జీత్' (పూలరంగడు) చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/ఆదుర్తి_సుబ్బారావు" నుండి వెలికితీశారు