దార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==సాహిత్య ప్రవేశం==
ప్రముఖ విమర్శకుడు డా.[[ద్వాదశి నాగేశ్వరశాస్త్రి|ద్వానాశాస్త్రి]] గారు అమలాపురంలోని[[అమలాపురం]]లోని కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో [[తెలుగు]] అధ్యాపకుడుగా పనిచేసేటప్పుడు వేంకటేశ్వరరావు కూడా ఒక విద్యార్థిగా ఆయన దగ్గర చదువుకొన్నారు. ఆయన ప్రోత్సాహంతో ఆ రోజుల్లోనే చిన్న చిన్నకవితలు, వ్యాసాలు రాసేవారు. వేంకటేశ్వరరావు మొదటి కవిత ఇంటర్మీడియట్ చదువుతుండగా కళాశాల మ్యాగ్ జైన్ లో ప్రచురితమైంది. ఆ కవిత పేరు ‘జీవితనావ’ ఆయన చదువుకున్న కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల రచనలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో వార్షిక సంచికను ప్రచురించేవారు. దానికి [[తెలుగు]], [[ఆంగ్లం]], [[హిందీ]], [[సంస్కృతం]] అధ్యాపకులతో పాటు విద్యార్థి ప్రతినిధులను కూడా సంపాదకమండలిలో తీసుకొనేవారు. ఐదు నిమిషాల ముందు ఒక అంశాన్నిచ్చి [[కవిత]], [[కథ]], వ్యాసం వంటి ఏదో ఒక ప్రక్రియ రూపంలో రాయమనేవారు. దానిలో ప్రథమ, ద్వితీయస్థానం సాధించిన వారిని ఈ సంపాదకమండలిలో విద్యార్థి ప్రతినిథులుగా ఎంపిక చేసేవారు. వేంకటేశ్వరరావు తన [[ఇంటర్మీడియట్]] మొదటి సంవత్సరంలోనే తెలుగు సృజనాత్మక రచనలో ప్రథమ స్థానాన్ని సాధించి, ఆ సంపాదకమండలిలో స్థానాన్ని సంపాదించారు. అప్పటి నుండీ డా.ద్వానాశాస్త్రి, డా.వాడవల్లి చక్రపాణిరావు, డా.బి.వి.రమణమూర్తి (మార్గశీర్ష) వంటి ప్రముఖ సాహితీవేత్తలను ఆకర్షించగలిగారు. అంతకుముందే ఉన్నతపాఠశాలలో చదివేరోజుల్లో శ్రీకంఠం లక్ష్మణమూర్తి, ఆతుకూరి లక్ష్మణరావు అనే [[బ్రాహ్మణ]] ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్థానిక సమస్యలపై పత్రికల్లో ఉత్తరాలు రాయటంతో తన రచనా ప్రవేశం మొదలైందని వేంకటేశ్వరరావు ఇలా రాసుకున్నారు.<ref>[ఆరు పదుల ద్వానా ( షష్టి పూర్తి ప్రత్యేక సంచిక, యువకళావాహిని ప్రచురణ, [[హైదరాబాద్]], 15 జూన్ 2008, పుట:63]</ref> '‘కోనసీమ కేంద్రం అమలాపురంలో[[అమలాపురం]]లో విస్తృతంగా సాహిత్య సభలు జరుగుతుంటాయి. ఆ వార్తలను పత్రికలు కూడా ఫోటోలతో సహా ప్రముఖంగానే ప్రచురిస్తుంటాయి. వాటిని బాగా గమనిస్తుండేవాణ్ణి. ఆ సాహిత్య వార్తల్లో నేను కూడా ఒక వ్యక్తిని కావాలనిపించేది. అప్పటికి సామాజిక వర్గంలో మా కుటుంబంలోగానీ, మా పల్లెలో గానీ ఎవరూ సాహిత్యం రాసిన వారు లేకపోవడం గమనించాను. ఆకాలేజీలో చేరకముందు హైస్కూల్లో చదివేటప్పుడు తెలుగు మాష్టారు శ్రీకంఠం లక్ష్మణమూర్తి, సోషల్ మాష్టారు ఆతుకూరి లక్ష్మణరావు గార్లు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వారిద్దరూ బ్రాహ్మణకులానికి చెందినవాళ్ళే. అయినా నన్ను ఎంతగానో ఇష్టపడేవారు. ... ఆ విధంగా పత్రికలు చదవడమే కాకుండా, పత్రికల్లో స్థానిక సమస్యల గురించి రాసేవాడిని. కథలు, వ్యాసాలు చదివి వాటిపై నాకు తోచిన అభిప్రాయాలను రాసి పత్రికలకు రాసి పంపించేవాణ్ణి...’’ ఇలా తన రచనా నేపథ్యాన్ని ‘మాగురువుగారు’ పేరుతో రాసిన వ్యాసంలో దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. ఆనాటి నుండీ చిన్న చిన్న జోక్స్, చిన్నచిన్న కవితలు, కథలు, వ్యాసాలు, [[దిన]], [[వార]], [[మాస పత్రికల్లోపత్రిక]]ల్లో రాయడం ద్వారా తన సాహిత్య ప్రవేశం ప్రారంభమైంది.
 
==రచనలు==