అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 76:
==అనంతపురం నగరపాలక సంస్థ==
{{main|అనంతపురం నగరపాలక సంస్థ}}
అనంతపురం నగరపాలక సంస్థ [[అనంతపురం జిల్లా]] లోని ఏకైక నగరపాలక సంస్థ. రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. [[బ్రిటీష్]] ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక అధికారులు ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి [[మున్సిపాల్టీ]] హోదా కల్పించింది. దేశానికి [[స్వాతంత్య్రం]] వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది
 
==ప్రముఖులు==
పంక్తి 82:
 
==వాతావరణం==
అనంతపురం శుష్క వాతావరణం కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం పొడిగా, వేడిమితో కూడి ఉంటుంది. [[ఫిబ్రవరి]] ద్వితీయార్థం నుండి వేసవి మొదలయి మేలో అత్యధిక [[ఉష్ణోగ్రత]] 37 డిగ్రీల సెంటీగ్రేడు (99 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. ఋతుపవనాలు [[సెప్టెంబరు]]లో మొదలయి [[నవంబరు]]లో ముగుస్తుంది. వీటివలన 250 ఎం ఎం (9.8 ఇంచి) ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి శీతాకాలం నవంబరు ద్వితీయార్థంలో మొదలయి [[ఫిబ్రవరి]] ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 22 నుండి 23 డిగ్రీల సెంటీగ్రేడు (72 నుండి 73 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 ఇంచి (560 ఎం ఎం) లు.
 
==చిత్ర్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు