ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==తొలి జీవితం==
ఉన్నవ లక్ష్మీనారాయణ [[గుంటూరు]] జిల్లా అప్పటి [[సత్తెనపల్లి]] తాలూకా [[వేములూరిపాడు|వేములూరుపాడు]] గ్రామంలో [[1877]] [[డిసెంబరు 4]]వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది.1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో [[రాజమండ్రి]] ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందాడు. 1916లో [[బర్లాండ్]], [[డబ్లిన్]] ‍లలో [[బారిష్టర్]] చదువు సాధించాడు. 1892లోనే లక్ష్మీబాయమ్మతో వివాహం జరిగింది.
[[బొమ్మ:Unnava llakshmi narayana pantulu.jpg|thumb|left|250px|జైలు జీవితంలో లక్ష్మీ నారాయణ పంతులు గారు]]
 
లక్ష్మీనారాయణ 1900లో [[గుంటూరు]]లో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాడు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1917 లో [[మద్రాసు]] హైకోర్టులో [[న్యాయవాది]]గా పనిచేశాడు. 1923 లో [[కాంగ్రెసు స్వరాజ్య]] పార్టీలో చేరాడు. అలాగే [[ఆంధ్రరాష్ట్ర]] [[కాంగ్రెసు]] కమిటీ కార్యదర్శులు ఇద్దరులో ఒకడుగా ఎన్నికయ్యాడు. [[పల్నాడు]] పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942 లో [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో చేరినందుకు [[జైలు]] శిక్ష అనుభవించాడు.
 
==సాంఘిక సేవ==