ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి, → (2) using AWB
పంక్తి 38:
 
==జీవితసంగ్రహం==
నెల్లూరు జిల్లా [[కోనేటమ్మ పేటలోపేట]]లో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. తండ్రి, అన్న కూడా ఈమెను బాగా చదివించాలని అనుకునేవారు.
 
1977లో బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శనలివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయాన్ని శైలజ కూడా వెల్లింది. అక్కడ [[విమానం]] ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు [[కె.చక్రవర్తి]] సమక్షంలో సరదాగా పాటలు పాడింది. ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి [[మార్పు]] (1978) సినిమా కోసం పాట పాడించారు.<ref>మెలొడీలోనే ఉంది మజా! నేపథ్య గాయని శైలజతో ముఖాముఖి, ఈనాడు ఆదివారం, 28 డిసెంబరు 2008.</ref> ఈనాటి ప్రముఖ దర్శకుడు [[తేజ]] ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు. ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", [[మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోనిపెళ్ళాం]]లోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.
 
ఈమె మద్రాసులో [[భరతనాట్యం]] నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు, దానికి వచ్చిన [[కె.విశ్వనాథ్]] తాను తీస్తున్న [[సాగర సంగమం]]లో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను, కుటుంబసభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.<ref>http://www.hindu.com/2007/11/19/stories/2007111959770600.htm</ref> ఇదే ఈమె నటించిన ఏకైన చిత్రం.
 
ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది [[పట్నం వచ్చిన పతివ్రతలు]]. అందులో ఆమె [[రాధిక]] గారికి తన గొంతును వాడారు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. ఆ తర్వాత [[వసంత కోకిల]]లో [[శ్రీదేవి]] గారికి, నిన్నే పెళ్లాడుతా మరియు మురారి చితాలల్లో [[టబు]]కి కూడా ఈమే డబ్బింగ్ చెప్పింది.
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.శైలజ" నుండి వెలికితీశారు