అయ్యగారి సాంబశివరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
==బాల్యం,విద్యాభ్యాసం==
ఎ.యస్.రావు [[సెప్టెంబర్ 20]], [[1914]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[మోగల్లు]]లో జన్మించాడు. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము]] నుండి విజ్ఞానశాస్త్రములో[[విజ్ఞానశాస్త్రము]]లో మాస్టరు డిగ్రీ అందుకొని అక్కడే అధ్యాపకునిగా ఆరు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశాడు. 1946లో సాంబశివరావు [[స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము]]లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో మాస్టరు డిగ్రీ చేయటానికి ప్రతిష్ఠాత్మక టాటా ఉపకార వేతనాలకు ఎన్నికైనాడు. 1947లో స్టాన్‌ఫర్డ్ నుండి ఇంజనీరింగు పట్టాపుచ్చుకొని భారతదేశము తిరిగివచ్చిన తర్వాత భారతదేశ [[అణుశక్తి]] విభాగములో అణు శాస్త్రవేత్తగా చేరాడు. అక్కడ [[హోమీ బాబా]] వంటి ప్రముఖులతో కలసి పనిచేశాడు. ఈయన [[2003]], [[అక్టోబర్ 31]]న మరణించాడు.
==విజయాలు==
సాంబశివరావు [[హోమీ జహంగీర్‌ భాభా|హోమీ భాభా]] మరియు [[విక్రం సారాభాయ్]] లతో కలసి పనిచేశాడు. అతడు భారత దేశంలో గల యువ శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులు శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగించాడు. ఈ ముగ్గురు మరియు మరికొంతమంది ప్రతిభావంతులలో ఒకరైన [[సూరి భగవంతం]] లతో కలసి ఒక [[ఎలక్ట్రానిక్స్]] కమిటీ యేర్పాటు చేయబడింది. దీనిని "భాభా కమిటీ" అని అంటారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అధ్యయనం భారతదేశంలో ఎలా ఉండాలో పరిపూర్ణ నివేదికను, సూచనలను అందజేసింది.
 
భాభా కమిటీ నివేదిక భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధికి మొదటి నమూనా అయింది. ఇది రావుగారి నమ్మకానికి మరియు ప్రయోగాత్మక అనుభవాలకు గుర్తుగా ఉంది. ఈ నివేదిక ప్రాప్తికి భారత ప్రభుత్వం స్వంతంగా ECIL అనే సంస్థను ఏప్రిల్ 11, 1967 లో స్థాపించింది. దీనికి ఛైర్మన్ గా [[సారాభాయి]], మొదటి బోర్డు డైరక్టర్ అయిన రావు మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరించారు. మొదటి పది సంవత్సరాలలో రావు ECIL కు చుక్కానిగా[[చుక్కాని]]గా ఉండి ఉత్పత్తి సామర్థ్యాన్ని, వ్యాపారాన్ని, సహాయాన్ని మరియు ఉపాథి సామర్థ్యాన్ని విశేషంగా పెంచారు. ఈ సంస్థలో రావు యొక్క అనుభవాల వలన [[భారత ప్రభుత్వం]] 1971 లో రావుగారిని ఎలక్ట్రానిక్స్ కమిషన్ లో ముఖ్య సభ్యునిగా నియమించింది.
 
డా. ఎ.ఎస్.రావు గారు ప్రతిభావంతుడైన [[శాస్త్రవేత్త]], [[ఇంజనీరు]], వ్యవస్థాపకుడు మరియు నాయకుడు. స్వదేశంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ స్థాపించడంలో మరియు భారత అణు రియాక్టర్లను నియంత్రించు వ్యవస్థలను అభివృద్ధిచేయుటకు కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. ఆయన ప్రసిద్ధ మానవతా వాది మరియు సామ్యవాది. ఆయన మధ్య తరగతి ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన కాలంలో సామాన్య ప్రజలకు మరుగుదొడ్లు కట్టించుటకు విశేషకృషి చేయడం ఆయనకు ప్రజలపై ఉన్న అభిమానానికి గుర్తుగా చెప్పుకోవచ్చు.