నాగూర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దీ. → ది. (2), గా → గా , → (3) using AWB
పంక్తి 37:
'''నాగూర్ బాబు''' సుప్రసిద్ధ గాయకుడు, మరియు డబ్బింగ్ కళాకారుడు. ఈయనకే '''మనో''' అనే పేరు కూడా ఉంది. [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మలయాళం]], మరియు [[హిందీ]] భాషల్లో అనేక [[పాట]]లు పాడాడు.
==నేపధ్యము==
నాగూర్ బాబు [[సత్తెనపల్లి]] లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి [[ఆలిండియా రేడియోలోరేడియో]]లో పనిచేసేవాడు. [[నేదునూరి కృష్ణమూర్తి]] దగ్గర [[కర్ణాటక సంగీతం]] నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. [[ఇళయరాజా]] ఆయన పేరును మనోగా మార్చాడు.
 
మనో అన్నయ్య తబలా వాద్యకారుడు. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళాడు. వాళ్ళ ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు సంపాదించాడు. తెలుగులో నాగూర్‌బాబుగా, తమిళంలో[[తమిళం]]లో మనోగా ఆయన ఇప్పటికిపాతిక వేల పాటలు పాడారు.
 
గాయకుడిగా ఆయన మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన [[కర్పూరదీపం]] అనే సినిమా లోది. [[రజనీకాంత్]] తెలుగు చిత్రాలకు ఆయనకు గాత్రదానం చేసి ఆయన మెప్పు పొందాడు. బుల్లితెర పై పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.
 
గాయకుడిగా ఆయన మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమా లోది.రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు గాత్రదానం చేసి ఆయన మెప్పు పొందాడు.బుల్లితెర పై పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.
==పేరు వెనుక చరిత్ర==
ఇతని అమ్మ గారి నాన్న గారు నాగూర్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడు. ఆయన, ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఒకే గురువు దగ్గర ఆ విద్య నేర్చుకున్నారు. ఇతని అమ్మ పేరు షహీదా, పెద్దమ్మ పేరు వహీదా. వాళ్ళిద్దరి పేరుతో కార్యక్రమాలు జరిపేవారు. గుంటూరు జిల్లా యద్దనపూడి, దొండపాడు, తదితర గ్రామాల్లో మునసబు, కరణాల ఇళ్ళ దగ్గర, రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇచ్చిన బియ్యం, దుస్తులతో జీవితం గడిపేవాళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే, పూట కూలీ కళాకారుల కుటుంబం వీరిది. వీరి తాత గారు 1964లో చనిపోయారు. మరుసటేడు [[అక్టోబర్]] 26న ఇతను పుట్టాడు. అందుకే, నాగూర్‌బాబు అని ఆయన పేరే పెట్టారు<ref name="మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!" />.
"https://te.wikipedia.org/wiki/నాగూర్_బాబు" నుండి వెలికితీశారు