ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
===ఇతర చిత్రాలు===
సంగీతదర్శకునిగా ఓగిరాలకు మొదటి చిత్రం [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939). నటి [[చిత్తజల్లు కాంచనమాల|కాంచనమాల]]తో కలిసి ఆయన ''నా సుందర సురుచిర రూపా'' అనే పాట పాడారు. ఈ పాటను కాంచనమాల, [[వై.వి.రావు]] పైన చిత్రీకరించారు. చలనచిత్రరంగంలో[[చలనచిత్రరంగం]]లో [[బెజవాడ రాజారత్నం]] గాయనిగా స్థిరపడటానికి ఓగిరాల సంగీతం ముఖ్య కారణం. [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] చిత్రంలో రాజారత్నంతో పాడించిన ''గోపాలుడే మన గోపాలుడే'', ''చెలి కుంకుమమే పావనమే'' తదితర గీతాలు పాడించారు. ఆ పాటలన్నీ ఆ రోజులలో జనం నాలుకలపై నిత్యం నాట్యం చేస్తూ ఉండేవి. [[విశ్వమోహిని]] (1940) చిత్రంలో ఆయన రాజారత్నంతో పాడించిన ''ఈ పూపొదరింటా'', ''భలే ఫేస్'', ''మేళవింపగదే చెలియా వీణ'' వంటి పాటలు ఆయన సంగీతానికి ఒక గొప్ప ఉదాహరణ. 1940లో అటువంటి ఆహ్లాదకరమైన సంగీతంతో కూడిన పాటలు అందించిన ఘనత ఓగిరాలకే దక్కింది.
 
[[1941]] నుండి ఓగిరాల, [[ఘంటసాల బలరామయ్య]] నిర్వహిస్తున్న [[ప్రతిభ పిక్చర్స్]] చిత్రాలకు సంగీతం అందించడం మొదలు పెట్టారు. ఆయన సంగీతం అందించిన [[ప్రతిభ పిక్చర్స్]] చిత్రాలు [[పార్వతీ కళ్యాణం (1941 సినిమా)|పార్వతీ కళ్యాణం]] (1941), [[గరుడ గర్వభంగం]] (1943), [[సీతారామ జననం]] (1944) మరియు [[ముగ్గురు మరాటీలు]] (1946). [[అక్కినేని నాగేశ్వరరావు]] రెండవ చిత్రం [[సీతారామ జననం]] (1944)లో, నాగేశ్వరరావుతో ''గురుబ్రహ్మ గురువిష్ణు'' శ్లోకం పాడించారు ఓగిరాల. [[ఘంటసాల బలరామయ్య]] తీసిన [[ముగ్గురు మరాటీలు]] (1946) చిత్రంలో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[టి.జి.కమలాదేవి]] చేత ''ఛల్ ఛలో వయ్యారి షికారి'' అనే యుగళగీతం పాడించారు. అదే చిత్రంలో [[కన్నాంబ]] చేత ''సతీ భాగ్యమే భాగ్యము'' మరియు ''తీరుగదా ఆశ'' అనే రేండు పాటలు పాడించారు. ఈ చిత్రంలో బెజవాడ రాజారత్నం ''జీవనము యమునా జీవనము'' మరియు ''రాటము భారతనారి కవచము'' అనే రెండు పాటలు పాడింది. ఈ చిత్రంలో ''జీవనము యమునా జీవనము'' పాట ప్రేక్షకాదరణ పొందింది, అది రాజారత్నం పాడిన పాట కావడం విశేషం.