జంధ్యాల గౌరీనాథశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
==సినీరంగ ప్రవేశం==
నిండైన విగ్రహమూ, విశాల నేత్రాలు గల వ్యక్తి కోసం అన్వేషిస్తున్న తరుణంలో దర్శకుడు [[కె.వి.రెడ్డి]]కి ఒక సభలో గౌరీనాథశాస్త్రి తారపడ్డాడు.
నాటకానుభవం లేకపోయినా ఉత్సాహం ఉంది గనుక, పాత్రకు న్యాయం జరుగుతుందని శ్రీనాథుడి పాత్రకు ఎంపిక చేశారు. శాస్త్రి గారి మంచి కంఠం, చక్కని వాచికం, రెండూ ఉన్నాయి కనుక ఇరువురికీ అంగీకారమైంది. సంభాషణలు వల్లె వేయించి, క్షుణ్ణంగా రిహార్సల్సు చేయించారు. దృశ్యాలు షూట్‌ చేసే ముందు, కనీసం మూడు, నాలుగు రోజులైనా రిహార్సల్సు ఉండేవి. [[పోతన]] పాత్రలాంటిది నటించడం [[నాగయ్య]]కీ కొత్త. కొత్తవాడైన గౌరీనాథశాస్త్రికి మరీ కొత్త. పాత్ర లక్షణాలను గ్రహించి, దర్పాన్ని జోడించి ఎంతో సహజంగా నటించాడు శాస్త్రి. పోతన చిత్రం విజయవంతమై శ్రీనాథుడి పాత్రధారి గురించి ''ఒక గొప్ప సహజ నటుడు లభించాడు'' అని అందరూ చెప్పుకున్నారు.
 
1956లో వచ్చిన '[[బలే రాముడు]]' సినిమాలో కూడా గౌరీనాథశాస్త్రి నటించాడు. నాగయ్య 'రామదాసు' చిత్రం ఆరంభిస్తూ శాస్త్రిని కబీర్‌ పాత్రకు తీసుకున్నారు. కాని, కొన్ని దృశ్యాల్లో నటించిన తర్వాత 1958లో గౌరీనాథ శాస్త్రి మరణించడంతో ఆ పాత్రను గుమ్మడి పూర్తి చేశాడు.
 
==చిత్ర సమాహారం==