ఆకెళ్ల రాఘవేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దీ. → ది. (5), ఉద్దేశ్యం → ఉద్దేశం, సాదు → సాధు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
}}
 
'''ఆకెళ్ల రాఘవేంద్ర''' (జననం: [[జూన్ 1]], [[1974]]) ఐఎఎస్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, [[తెలుగు]] భాషాభిమాని. [[ఆంత్రోపాలజీ]], [[సోషియాలజీ]], [[ఫిలాసఫీ]] లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త.
 
== '''వ్యక్తిగతం''' ==
ఆకెళ్ల రాఘవేంద్ర పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని[[ఆంధ్రప్రదేశ్‌]]లోని [[తూర్పుగోదావరి జిల్లాలోజిల్లా]]లో ఉన్న [[రాజమండ్రి]]. పెరిగినది కోనసీమలోని[[కోనసీమ]]లోని [[అమలాపురం]] ప్రాంతంలో. పదవ తరగతి వరకు మురమళ్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఆపై అమలాపురంలోని ఎస్ కె బి ఆర్ కళాశాలలో బి.ఎస్సీ వరకు విద్యాభ్యాసం చేశారు. తండ్రి పేరు సుబ్రహ్మణ్య శర్మ, తల్లి సూర్యకుమారీ లలిత. వీరికి గల ముగ్గురి సంతానంలో చివరివారు ఆకెళ్ల రాఘవేంద్ర. భార్య పేరు మాధవి. కుమార్తె సిరివెన్నెల; కుమారుడు సంకల్ప రుత్విక్.<ref>ఫిబ్రవరి 11, 2010, ఈనాడులో ప్రచురణ</ref>
 
== '''ఉద్యోగం''' ==
డిగ్రీ పూర్తవగానే 1994లో రాఘవేంద్ర భారతదేశంలోని అత్యున్నత స్థాయి పరీక్ష అయిన IASకి సిద్ధమయ్యారు. కాని, ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్లగలిగినా - చివరకు 12 మార్కుల్లో IASని కోల్పోయారు. అనంతరం 1997 నుంచి 2000 వరకు పాత్రికేయుడిగా [[ఈనాడు]], ఈటీవీలలో[[ఈటీవీ]]లలో పనిచేశారు. [[హైదరాబాద్]], [[ఢిల్లీ]], చెన్నైలలో[[చెన్నై]]లలో వృత్తి పరమైన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం, వెబ్‌దునియా.కామ్ వారి [[తెలుగు]] వెర్షన్ వెబ్‌ప్రపంచం.కామ్‌లో సీనియర్ కరస్పాండెంట్‌గా చేరి, చెన్నై విభాగానికి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ ఉద్యోగంలో 2003 వరకూ పనిచేసి - ఆపై IAS విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 10 వేలమందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి - కొన్ని వందల మందిని అత్యున్నత సర్వీసులలో ప్రవేశించేలా చేసిన శిక్షకుడు, విద్యావేత్త ఆకెళ్ల రాఘవేంద్ర.
 
== '''వ్యక్తిత్వం''' ==
పంక్తి 63:
 
== '''రచయిత''' ==
ఆకెళ్ల రాఘవేంద్ర చేయి తిరిగిన రచయిత. IAS విద్యార్థులకు ఆంత్రోపాలజీ, [[తెలుగు]] సాహిత్యం తదితర అంశాలపై గ్రంథాలు రచించారు. గురజాడ రచించిన "కన్యాశుల్కం" నాటకంలోని గిరీశం, వెంకటేశం - మళ్లీ పుడితే అనే చిలిపి ఊహతో "ఈనాటీ గిరీశం" అనే హాస్య వ్యంగ్య నవల రచించారు ఆకెళ్ల. విజయాన్ని ఎలా అందిపుచ్చికోవాలో విశ్లేషిస్తూ "సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్" పుస్తకాన్ని వెలువరించారు. [[మాడపాటి హనుమంతరావు]] జీవితంపై కూడా ఓ పుస్తకాన్ని రచించారు. కొన్ని సినిమాలకు సంభాషణలు, కథలు అందించారు. ఆకెళ్ల కలం నుంచి జాలువారిన మరిన్ని ప్రముఖ రచనల్ని గమనిస్తే...
 
== '''మీరు సామాన్యులు కారు''' ==
"https://te.wikipedia.org/wiki/ఆకెళ్ల_రాఘవేంద్ర" నుండి వెలికితీశారు