ఉప్పలపాటి వెంకటేశ్వర్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==సేవలు==
"తారాపూర్" అణు విద్యుత్ కేంద్రంలో చేరి, వివిధ అణుశక్తి పరిశోధనలలో పాలుపంచుకున్నారు. విశిష్ట శిక్షణ నిమిత్తం జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాలలో పర్యటించారు. భారత దేశపు మొట్టమొదటి అణురియాక్టరు 'అప్సర" రూపకల్పన, అభివృద్ధి దశలు, ప్రయోగాలు నిమిత్తం నియమితులైన ముగ్గురు సాంకేతిక శాస్త్రవేత్తలలో ఈయన ఒకరుగా కృషి చేశాఅరు. [[అమెరికా]], [[ఇంగ్లండ్]] లలో [[అణుశక్తి]] మీద గాడాధ్యయనం చేసిన (1957-58) ఫలితాలు అణుశక్తి మీద ఉన్నత విద్య నేర్పిన అంశాలతో అణు రియాక్టర్ రూపకల్పనకు బాగా ఉపయోగపడ్డాయి. మూడవ రియాక్టరు "జర్లీనా" కు రూపకల్పన చేసి, ప్రయోగించే శాస్త్రవేత్తల బృందానికి సారధ్యం వహించారు. తారాపూర్ అణువిద్యుత్ కేంద్రంలో దాదాపు పుష్కరకాలం పాటు పనిచేశారు. ఈ వ్యవధిలోనే రెండు విభాగాలను కొత్తగా (1963) నెలకొల్పడానికి దోహదపడ్డారు. 1965 తదుపరి కాలంలో ఈయన ఆలోచనలు,ల్ ఊహలు అన్నీ ఉత్పత్తి రంగం మీదకు మళ్ళినాయి. కార్బన్ ఫిల్మ్‌లురెసిస్టర్లు మొదలైన వాటిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారచేసే ప్రాధమిక స్థాయి ప్రాజెక్టును రూపొందించారు.
 
1967 లో ఈయన స్వరాష్ట్రానికి వచ్చేశారు. ఈ సమయంలోనే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను నెలకొల్పడాంతో ఆ సంస్థలో నియమితులయ్యారు. ఇ.సి.ఐ.ఎల్ తొలుత [[బొంబాయి]]లో ఉండేది. [[హైదరాబాదు]]కు తరలించడంలో ఈయన కూడా కృషి జరిపారు. తొలుత రెసిస్టర్స్, కెపాసిటర్స్, విభాగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో అవిశ్రాంత పరిశోధనా కృషి చేశారు.
పంక్తి 12:
అందుకు అణుశక్తి రంగంలో ఆర్జించిన విశేష అనుభవం బాగా ఉపయోగపడింది. ఈ సంస్థలో పనిచేసిన ఏడేళ్లలో నాలుగు ప్రత్యేక విభాగాలను నెలకొల్పి, వాటికి అధ్పతిగా ఉన్నారు. అప్పట్లోప్రఖ్యాత శాస్త్రవేత్త [[ఎ.ఎస్.రావు]] చైర్మన్ గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో ఈయన ఎలక్ట్రానిక్స్ సాంకేతిక రంగంలో అవిరామ పరిశోధనలు చేశారు. ఇ.సి.టి.వి. బ్లాం అండ్ వైట్ కు రూపకల్పన చేసి మహోన్నత విజయాన్ని సాధించారు.
 
ఐసిఐఎల్ సంస్థలో ఈయన 1967లో నెలకొల్పి నేతృత్వం వహించిన రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ విభాగం కేవలం ఏడేళ్ళ వ్యవధిలో కోటి రూపాయల ఉత్పత్తిని సాధించి, కేంద్ర ప్రభుత్వ బంగరుబంగారు పతకాన్ని (1975-76) అందుకున్నారు. ఈ సంస్థలో పనిచేసిన పుష్కర కాలమూ అతి ప్రతిభావంతంగా గడిపారు.
 
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థలో శాటిలైట్ వ్యవస్థను అధ్యయనం చేసి తిరిగి వచ్చిన తర్వాత [[ఇ.సి.ఐ.ఎల్]].లోనే టీ.వీ సాంకేతిక అభివృద్ధిని సుసాధ్యం చేశారు. ప్రత్యేకంగా టి.వి విభాగాన్ని నెలకొల్పడానికి దోహదపడ్డారు.
 
మన రాష్ట్రంలో తొలిశ్రేణి బ్లాక్ అండ్ వైట్ టీవీలను రూపొందించిన ఘనత ఈయనకు దక్కింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో అద్భుతలను ఆవిష్కరించి, తొలి ఏడాదిలోనే భారీ స్థాయి లాభాలను సమకూర్చారు. తర్వాత కాలంలో [[ఉత్తరప్రదేశ్]] లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మెనేజింగ్ డాఇరక్టరుగా నియమితులయ్యారు. ఈ సంస్థలో కూడా పరిశోధనా కృషి కొనసాహించారు. తత్ఫలితంగా ఈ సంస్థ సౌరశక్తి రంగంలో అగ్రగామిగా భాసిల్లి ఈ రోజున సోలార్ సెల్స్ ఉత్పత్తిలో ప్రపంచం లోని మొదటి ఆరు అగ్రగామి దేశాలలో ఒకటిగా మన దేశాన్ని నిలబెట్టింది.