"నూనె" కూర్పుల మధ్య తేడాలు

19 bytes added ,  4 సంవత్సరాల క్రితం
'''వృక్షనూనెలు''' : వృక్ష నూనెలు రెండు రకాలు.
 
1. మొక్కల/చెట్ల పళ్లగుజ్జు, విత్తనాల నుండి ఉత్పన్నమగు నూనెలు/కొవ్వులు. వీటినే''' శాకతైలములు/నూనెలు''' (vegetable oils) అందురు. ఇందులో ఎక్కువ నూనెలు ఆహారయోగ్యమైనవి (edible oils). ఇవి[[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త కొవ్వుఆమ్లాలు]] మరియు [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వుఆమ్లాలను]] కలిగి ఉంటాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో రెండు రకాలున్నవి.ఒకటి ఏక ద్విబంధమున్న అసంతృప్త ఆమ్లాలు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న ఆమ్లాలు.ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వుఆమ్లాలను బహుద్విబంధ కొవ్వు ఆమ్లాలని అందురు. కొన్ని నూనెలు (ముఖ్యంగా కొన్ని చెట్ల గింజల నూనెలు) ఆహారయోగ్యం కాదు. వాటిని సబ్బులు, [[కొవ్వు ఆమ్లాలు]], గ్రీజుల తయారిలో వాడెదరు.
 
* పళ్ళగుజ్జు నుండి తీయునూనెలు: [[ఆలివ్ నూనె]], మరియు [[పామాయిల్]] వంటివి.
* పూల మొగ్గల నుండి: లవంగనూనె వంటివి.
* బెరడునుండి: దాల్చినచెక్క (cinnamon), cassia, మరియు sassafras లనుండి
* ఆకుల నుండి: నీలగిరి (Eucalyptus), దాల్చిన (cinnamon), లెమన్‌గ్రాస్‌, పెప్పెర్‌మెంట్, రోజ్‌మేరి, టిటీ నూనెలు
* కాండం నుండి: గంధంనూనె, దేవదారు (cedar), కర్పూరం, రోజ్‌వుడ్‌ నూనెలు.
* దుంపవేర్లు: [[అల్లం]]. [[పసుపు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2054005" నుండి వెలికితీశారు