భూ సమవర్తన కక్ష్య: కూర్పుల మధ్య తేడాలు

కొంత సమాచారం చేర్పు
ఆకృతి సవరణ
పంక్తి 1:
[[దస్త్రం:Geosynchronous_orbit.gif|thumb|భూ సమన్వయ కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహం యానిమేషన్]]
భూ సమన్వయ కక్ష్య ('''GSO''') భూమి చుట్టూ ఉన్న ఒక కక్ష్య. ఈ కక్ష్యలో తిరుగుతున్న్న వస్తువు పరిభ్రమణ కాలం భూభ్రమణ కాలంతో సమానంగా, అంటే దాదాపు 23 గంటల 56 నిముషాల 4 సెకండ్లు ఉంటుంది.<ref>V. Chobotov, ed., (1996) ''Orbital Mechanics, 2nd edition'', AIAA Education Series, p. 304.</ref> కక్ష్యాకాలం సమానంగా  ఉండడం అంటే అర్థం, భూమ్మీద ఉన్న  పరిశీలకునికి, భూ సమన్వయ కక్ష్యలో ఉన్న వస్తువు ప్రతి  [[సైడిరియల్ రోజు]] తరువాత అదే స్థానానికి తిరిగి వస్తుంది. ఒక రోజు సమయంలో ఆ వస్తువు ఆకాశంలో 8 అంకె ఆకారంలో ఉండే పథంలో ప్రయాణిస్తుంది.  ఈ 8 ఆకారం యొక్క లక్షణాలు - కక్ష్య యొక్క వాలు, ఎక్సెంట్రిసిటీపై ఆధారపడి ఉంటాయి. ఉపగ్రహాలను సాధారాణంగా తూర్పు దిశగా ప్రయోగిస్తారు.  భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లో  తిరిగే ఉపగ్రహాలు భూభ్రమణం కంటే  వేగంగా తిరుగుతూంటాయి కాబట్టి, భూమిపై ఉన్న పరిశిలకునికిపరిశీలకునికి ఇవి తూర్పు  దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాయి. భూ సమన్వయ  కక్ష్య కంటే ఆవల (దూరంగా) ఉన్న కక్ష్యలోని ఉపగ్రహాలు  పశ్చిమ దిశగా  ప్రయాణిస్తున్నట్లు  కనిపిస్తాయి.
 
భూ సమన్వయ కక్ష్యల్లో ఒక ప్రత్యేకత కలిగినది భూస్థిర కక్ష్య. ఇది ఒక వృత్తాకార భూసమన్వయ  కక్ష్యయే, దీని వాలు (ఇన్‌క్లినేషన్) మాత్రం సున్నా ఉంటుంది. అంటే ఇది  సరిగ్గా భూమధ్య రేఖకు సరిగ్గా ఎదురుగా ఉంటుందన్నమాట. భూమిపై ఉన్న పరిశీలకులకు, భూ స్థిర కక్ష్యలో ఉన్న వస్తువు, ఆకాశంలో ఒకే స్థానంలో స్థిరంగా ఉన్నట్లు  కనిపిస్తుంది. భూ సమన్వయ, భూ స్థిర - రెంటినీ ఒకే అర్థంలో వాడడం కద్దు.<ref>C. D. Brown (1998), ''Spacecraft Mission Design, 2nd Edition,'' AIAA Education Series, p. 81</ref> కచ్చితంగా చెప్పాలంటే, భూ సమన్వయ భూ కక్ష్య, భూ సమన్వయ భూమధ్య రేఖా కక్ష్య,  భూ స్థిర కక్ష్యలను సమానార్థంలో వాడవచ్చు<ref>{{వెబ్ మూలము|url=http://www.arianespace.com/launch-services-ariane5/Ariane5_users_manual_Issue5_July2011.pdf|title=Ariane 5 User's Manual Issue 5 Revision 1|date=July 2011|work=arianespace|accessdate=28 July 2013}}</ref>. [[సమాచార ఉపగ్రహం|సమాచార ఉపగ్రహాలు]] సాధారణంగా భూస్థిర కక్ష్యలో గానీ, లేదా భూ స్థిర కక్ష్యకు దగ్గరగా గానీ ఉంటాయి. దీనివలన,  భూమిపై ఉన్న యాంటెన్నాలు శాశ్వతంగా ఒకే దిశలో ఉండేలా స్థాపించవచ్చు, వాటిని పదే పదే కదిలించాల్సిన అవసరం లేదు. 
"https://te.wikipedia.org/wiki/భూ_సమవర్తన_కక్ష్య" నుండి వెలికితీశారు