వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
1600 ఎకరాల భూమిని డిసెంబర్ 2006లో ప్రభుత్వానికి అప్పగించటం విపక్షాల విమర్శకి గురయ్యింది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగివున్నందుకు విపక్షాలు రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని కోరాయి.<ref>{{cite news |title= I've 1,000 acres more, says CM |url= http://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Ive_1000_acres_more_says_CM/articleshow/843875.cms |work=Times of India |location=India |date= 19 December 2006 |accessdate=26 May 2009}}</ref>.ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు మరియు పత్రికలు ఆయనపై ఆరోపణలు చేసాయి. అక్రమ ఆస్తుల సంపాదన కేసులో 2011లో ఆయనపై మరియు ఆయన సకుమారుడు జగన్ పై సి.బి.ఐ వారు అభియోగ పత్రం జారీ చేసారు.
 
ఇదివరకు ఏ ముఖ్యమంత్రిపై రాని అవినీతి విమర్శలు వైఎస్సార్ పై వచ్చాయి. వైఎస్సార్ కేబినెట్లో పనిచేసిన మంత్రులు సైతం వైఎస్సార్ పై విమర్శలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రులు, ప్రస్తుత రాష్ట్రమంత్రులు కూడా విమర్శలు లేవదీశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని లూటీచేశాడని దేవాదాయశాఖ మంత్రి [[రామచంద్రయ్య]] విమర్శించగా<ref>ఈనాడు దినపత్రిక తేది 16-04-2012</ref> వైఎస్సార్ హయంలో బాక్సైట్ గనులను అడ్డగోలుగా, కీలక చట్టాలను తుంగలో తొక్కి మరీ ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు కేంద్ర గిరిజన శాఖ మంత్రి [[కిశోర్ చంద్రదేవ్]] ఆరోపించారు.<ref>ఈనాడు దినపత్రిక 22-04-2012</ref> వైఎస్సార్ కాలంలో జరిగిన భూపంపిణీకి కాగ్ సైతం తప్పుపట్టింది.<ref>విశాలాంధ్ర తేది 30-03-2012</ref> వైఎస్ కాలంలో ఆయన కుటుంబం మాత్రమే బాగుపడింది కాని సామాన్య ప్రజలు బాగుపడలేరని<ref>ఆంధ్రప్రభ 08-09-2010</ref> ప్రజలకు పప్పుబెల్లాలు పంచి కొడుకుకి కోట్ల రూపాయలు దోచిపెట్టిన మహానుభావుడని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించాడు.<ref>ఈనాడు 28-04-2012</ref> వైఎస్ ని నమ్మి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టితే ఆయన తన అవినీతితో కొడుక్కి లక్ష రూపాయలు దోచిపెట్టాడని [[పాల్వాయి గోవర్థన్ రెడ్డి]] ఆగ్రహించాడు.<ref>ఈనాడు 23-04-2012</ref> ధనయజ్ఞం చేసి వేలకోట్లు మాయం చేశారని [[యనమల రామకృష్ణుడు]] విమర్శించాడు.<ref>ఈనాడు 16-04-2012.</ref> అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫించన్లు, కిలో రెండు రూపాయల బియ్యం, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంగిలి మెతుకులు విసిరి విలువైన భూములు, ఖనిజ సంప్దను కొట్టేశారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు.<ref>ఈనాడు 10-06-2012</ref> వైఎస్ కేబినెట్లో పనిచేసిన అప్పటి మంత్రి [[శంకర్రావు]] వైఎస్ పై చేసిన అవినీతి ఆరోపణలను సుమోటాగా స్వీకరించి హైకోర్టు విచారణ చేపట్టింది. అరవిందో, హెటిరో సంస్థలకు అడ్డగోలుగా భూములు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా జగన్ సంస్థలలో పెట్టుబడులు వచ్చేలా చేయడం వెనుక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్, [[జగన్]]లు మరికొందరితో పన్నిన నేరపూరిత కుట్ర ఉందని, వీరు ప్రభుత్వాన్ని మోసం చేశారని సీబీఐ తొలి చార్జిషీట్ లో స్పష్టంగా పేర్కొంది.<ref name="ఈనాడు 05-05-2012">ఈనాడు 05-05-2012</ref> తెలంగాణాకు 50 ఏళ్ళలో జరిగిన అన్యాయం ఒక ఎత్తయితే, వైఎస్సార్ అయిదేళ్ళ పాలనలో సాగిన అన్యాయం ఒకెత్తు అని మాజీ హోంశాఖ మంత్రి [[దేవేందర్ గౌడ్]] ఆగ్రహించాడు.<ref name="ఈనాడు 05-05-2012"/> తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తనయుడి సంస్థలలో అనుమాస్పద రీతిలో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిచేరినట్లు కాగ్ అక్షింతలు వేసింది<ref>http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=5&ContentId=94373</ref> రాంకీకి ప్రయోజనాలు కల్పించడానికి దాని చైర్మెన్ [[అయోధ్య రామిరెడ్డి]]తో కలిసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ కుట్ర పన్నినట్లు సీబీఐ వెల్లడించింది.<ref name="ఈనాడు 08-05-2012">ఈనాడు 08-05-2012</ref> "వైఎస్సార్ ప్రభుత్వం నిబంధనాలకు విరుద్ధంగా జడ్చర్ల సెజ్ లో హెటిరో, అరవిందో గ్రూపులకు చెరో 75 ఎకరాలు కట్టబెట్టింది. రంగారెడ్డి జిల్లా పాశమైలారంలో 30 ఎకరాల భూమిని నిబంధనలు విరుద్ధంగా అరవిందో నుంచి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కు బదిలీ చేసింది. జడ్చర్లలో 150 ఎకరాల భూమిని తక్కువ ధరకే కేటాయించిం"దన్నది సీబీఐ అభియోగం.<ref name="ఈనాడు 08-05-2012"/> అవినీతి నిరోధక చట్టం కింద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నేరానికి పాల్బడ్డారని సీబీఐ తేల్చి చెప్పింది. క్విడ్ ప్రో కో రూపంలో పత్రిక ప్రారంభం కాకమునుపే అందులో అధిక ప్రీమియంతో పెట్టుబడులు వచ్చాయని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది.<ref>ఈనాడు 22-05-2012.</ref> వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి [[నిమ్మగడ్డ ప్రసాద్]]కు వైఎస్ చాలా అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొంది.వాన్‌పిక్ ప్రాజెక్టుతో పాటు షిప్‌యార్డ్, [[ఒంగోలు]]లో గ్రీన్‌ఫీల్డ్ ఏర్ పోర్టుతో పాటు భారీ ఎత్తున అసైండ్, ప్రభుత్వ భూములను కట్టబెట్టడం, స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ, సీనరేజి ఫీజుల మినహాయింపు వంటి అక్రమ ప్రయోజనాలెన్నింటినో నిమ్మగడ్డ కంపెనీలకు కల్పించారాని తెలిపింది. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ జగన్ కంపెనీల్లో రూ.854 కోట్ల రూపాయలు పెట్టారని తెలిపింది.<ref>ఈనాడు 25-05-2012</ref>
 
==2009 ఎన్నికలు==