వేంగి: కూర్పుల మధ్య తేడాలు

157.48.228.154 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2029817 ను రద్దు చేసారు
పంక్తి 5:
 
== "వేంగి" పేరు ==
"వేంగి" అనే పేరు పురాతనమైనదిగా కనిపించడం లేదు. కంచి వద్ద 'వెంగో' లేక 'వేంగి' అనే పేరు ఉన్నదని, [[ఆంధ్ర దేశం]] మధ్యలో ఈ పేరు గల నగరం ఏర్పడడానికి కారణాన్ని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన [[చిలుకూరి వీరభద్రరావు]] ఈ విధంగా ఊహించాడు. ("ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము") <ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp [[ఆంధ్రుల చరిత్రము]] - చిలుకూరి వీరభద్రరావు] ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల 1-4-0. రాజపోషకులు: [[బొబ్బిలి]] రాజా, [[పిఠాపురం]] రాజా, [[మునగాల]] రాజా</ref> -
:ఈ దేశము పూర్వము నాగులచే పరిపాలింపబడెడిది. దక్షిణ దేశమందలి నాగులలో "అఱవలార్" ఒక తెగ. కాంచీ పురమునకు దక్షిణదేశమున ఉండే వారు గనుక ఆ ప్రదేశం "ఆఱవనాడు" అనబడింది. కనుకనే టాలెమీ వంటి విదేశీ చరిత్రకారులు మైసోలియా (కృష్ణానది) దక్షిణ ప్రాంతాన్ని "ఆశార్‌నోరి" (అర్ వార్ నాయ్) అని పేర్కొన్నారు. మొట్టమొదట కృష్ణా గోదావరి మధ్య దేశం "కూడూహార విషయం" అనబడేది. దానికి రాజధాని "కూడూరా" (గూడూరు లేక గుడివాడ?). ఏ కారణము చేతనో రాజధాని మార్చుకొనవలసి వచ్చినది. సాలంకాయన గోత్రుడైన పల్లవరాజులలో నొకరు ఒక నూతన నగరమును నిర్మింపజేసి దానికి "బెబ్బులి" అనే అర్ధం వచ్చే "వేంగి" అనే పేరు పెట్టాడు. అక్కడినుండి పాలించే రాజులు వేంగిరాజులని, వారిచే జయింపబడిన దేశాన్ని వేంగి దేశమని అనడం మొదలుపెట్టారు. ... క్రీ.శ. 4 శతాబ్దంలో [[అలహాబాదు]] శాసనంలో వేంగిని ప్రస్తావించారు గనుక అంతకు పూర్వమే అనగా క్రీ.శ. 2వ లేదా 3వ శతాబ్దంలో వేంగి నగరం ఏర్పడి ఉండవచ్చును.
 
అసలు ఈ చిన్న గ్రామమే ఒకనాటి వేంగి మహానగరమా? అనే ప్రశ్నకు చిలుకూరి వీరభద్రరావు ఇలా వివరణ ఇచ్చాడు.
:వేంగీ దేశమునకు ముఖ్య పట్టణముగా నుండిన వేంగి నగరం [[కృష్ణా]] మండలంలోని యేలూరుకు ఉత్తరాన 8 మైళ్ళ దూరములోనున్నది. ఆ స్థానమున నిపుడు పెదవేగి, చినవేగి అను పల్లెలు మాత్రమున్నవి. వీనికి దక్షిణముగా 5 మైళ్ళ దూరమున దెందులూరను గ్రామము కలదు. ఈ గ్రామమునకు గంగన్నగూడెము, సేనగూడెము అను శివారు పాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిసి ఒక మహా పట్ణముగనుండి వేంగీపురమని పిలువంబడుచుండెను. ఈ ప్రదేశమునందు శిధిలమైపోయిన శివాలయములు[[శివాలయము]]లు పెక్కులు గలవు. మరియు జ్ఞానేశ్వరుని యొక్క విగ్రహములు నాలుగు దెందులూరుకు దక్షిణముగానున్న చెఱువు సమీపముననుండినవి. వానిలో నొకటి మిక్కిలి పెద్దదిగానున్నది. ఈ గ్రామమునకు తూర్పు ప్రక్కను భీమలింగము దిబ్బయను పేరుగల యెత్తైన యొక పాటి దిబ్బ గలదు. దానికుత్తరముగా నూకమ్మ చెఱువును, దాని నడుమనొక మట్టి దిబ్బయు, దానిపై రెండు రాతి నందులును గలవు. దానిని నారికేళవారి చెఱువని చెప్పుదురు. వాని గట్లపైని రెండు శిలా శాసనములు నిలువుగానుండియు, మరిరెండు సాగిలబడియు నుండినవి. పెదవేగికిని[[పెదవేగి]]కిని, చినవేగికిని[[చినవేగి]]కిని నడుమ మఱియొక మంటిదిబ్బ గలదు. వీనిన్నింటిని పరిశోధించి చూడగా వేంగీపురము మిక్కిలియున్నత స్థితి యందుండిన మహానగరముగానుండెననుటకు సందియము లేదు. .... వేంగీపురమనియెడి మహానగరమొకటి యిక్కడుండెనా యని కొందఱు సంశయించుచుండిరి గాని విజయదేవవర్మ యొక్కయు, విజయనందివర్మ యొక్కయు శాసనములా సంశయమును నివారించినవి. దండియను మహాకవి [[కొల్లేరు]]ను వర్ణించుచు దానికి ననతి దూరముగానుండిన యీ వేంగీపురమునే యాంధ్ర నగరియని పిలిచియున్నాడు. విజయదేవవర్మ, విజయనందివర్మ శాసనములలో నుదాహరింపబడిన చిత్రరధస్వామి దేవాలయమిప్పటికిని నిలిచియుండి యఅ పేరుతోనే పిలువంబడుచున్నది. (''ఈ రచన 1910లో ప్రచురితమయ్యింది'')
 
అయితే వేంగి అన్న పేరు పూర్వచారిత్రిక దశకు చెందిన అత్యంత పురాతనమైన గ్రామాల పేర్లలో ఒకటిగా డాక్టర్ పి.వి.పరబ్రహ్మశాస్త్రి వర్గీకరించారు.<ref>ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం:పి.వి.పరబ్రహ్మశాస్త్రి:ఎమెస్కో బుక్స్:2013 ప్రచురణ:పేజీ.23</ref>
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు