గూడ అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
 
==రచయితగా==
నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా ఎన్నో [[కథలు]], [[పాటలు]] రాసిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు రాశాడు. వీటన్నింటికి తోడు సినిమాల్లో పాటలు రాసిన తర్వాత తెలుగు నేల నలుమూలలా ఆబాలగోపాలం అందరి నోళ్లలో నానుతున్నాడు. వృత్తిరీత్యా [[హైదరాబాద్‌]]లో ఫార్మసిస్ట్‌గా పనిచేశాడు. ఆయన [[పక్షవాతం]] వ్యాధితో బాధపడుతున్నప్పుడు [[తెలంగాణ]] ప్రభుత్వం వైద్యం చేయడానికి ముందుకు వచ్చింది.<ref>[http://www.deccanchronicle.com/141013/nation-current-affairs/article/telangana-state-takes-responsibility-ailing-poet-guda-anjaiah Telangana State takes responsibility of ailing poet Guda Anjaiah-దక్కన్ క్రానికల్-13-10-2014]</ref> ఆయన వ్రాసిన "ఊరు మనదిరా" పాట 16 భాషలలో అనువాదమయింది. ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసాడు.
 
బడికి పోతున్న సమయంలో దారినపోతున్న ఒక రైతును పలకరించగా ''ఊరిడిసి పోవన్నా..ఉరిపెట్టుకోవన్నా...'' అన్న మాటలే తన తొలి పాటకు అన్న ప్రాసన చేశాయని..తను కళ్లారా చూసిన కష్టాలకు, వాటిని అనుభవిస్తున్న వారి నోట వచ్చిన మాటల స్ఫూర్తిగా పాటలల్లడం తనకు బాల్యంలోనే అబ్బిన విద్య అని ''అసలేని వానల్ల ముసలెడ్లు కుట్టుకొని..'' అనే ఆయన తొలిపాట పుట్టుకకు నేపథ్యం అదేనని అంజయ్య ప్రతి సభలోనే చెప్పేవాడు.
"https://te.wikipedia.org/wiki/గూడ_అంజయ్య" నుండి వెలికితీశారు