సముద్రాల రాఘవాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
==తెలుగు చిత్ర పరిశ్రమ==
===సినీరంగప్రవేశం===
వేల్ పిక్చర్స్ అధినేత పి.వి.దాస్‌తో గూడవల్లి రామబ్రహ్మంకు ఉన్న పరిచయం వల్ల ఆయనతోపాటు సముద్రాల రాఘవాచార్య తరచూ స్టూడియోకు వెళుతుండేవాడు. ఆ స్నేహంతో [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం]], [[శ్రీకృష్ణ లీలలు (1935 సినిమా)|శ్రీకృష్ణ లీలలు]] సినిమాలకు ప్రకటనలు వ్రాసియిచ్చాడు. తరువాత వేల్ పిక్చర్స్ వారి [[మాయాబజార్ (1936 సినిమా)|మాయాబజార్]],[[ద్రౌపదీ వస్త్రాపహరణం]] సినిమాలలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమైతే సహకరించాడు. ఆ విధంగా ఇతడు సినిమా రచనలో అనుకోకుండా వేలుపెట్టాడు. తరువాత [[కనకతార (1937 సినిమా)|కనకతార]] సినిమాలో ఇతనికి [[సంభాషణలు]], పాటలు వ్రాసే అవకాశం చిక్కింది. కనకతార నిర్మాణ సమయంలోనే బి.యన్.రెడ్డి, [[హెచ్.ఎం.రెడ్డి]]లు రోహిణీ పిక్చర్స్ అనే సినీనిర్మాణ సంస్థను స్థాపించి [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]] సినిమాకు ఇతడిని రచయితగా పెట్టుకున్నారు. తరువాత బి.యన్.రెడ్డి రోహిణి సంస్థనుండి బయటకు వచ్చి వాహినీ సంస్థను స్థాపించాడు. వాహిని సినిమాలకు సముద్రాల ఆస్థాన రచయితగా మారిపోయాడు. ఇతడు దాదాపు 80 చిత్రాలకు పనిచేసి సుమారు 1000 పాటలను రచించాడు<ref name=పైడిపాల />.
 
===రచయితగా===