నన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
*ఆంధ్రకవులలో మొదటివాఁడు. వేగిదేశాధీశుఁడైన రాజరాజనరేంద్రుఁడు రాజమహేంద్రమున రాజ్యము చేయుకాలమున అతనియొద్ద ఇతఁడు ఆస్థానపండితుఁడుగా ఉండెను. ఇతఁడు తన యేలినవాని ప్రేరేఁపణచేత భారతమున మొదటి రెండుపర్వములను, ఆరణ్యపర్వమున కొంతభాగమును తెనిఁగించి కాలధర్మమును పొందెను. (తక్కిన భారతవిశేషమును ఎఱ్ఱాప్రెగ్గడయు, తిక్కన సోమయాజియు తెనిగించిరి. చూ|| తిక్కన.) మఱియు ఈయన ఆంధ్రశబ్దచింతామణి అను పేర తెనుఁగునకు ఒక వ్యాకరణమును రచియించి దానికి లక్ష్యముగా ఈ భారతమును రచియించెను అని చెప్పుదురు. ఈ హేతువును బట్టియే ఇతఁడు వాగనుశాసనుఁడు అనఁబడెను.
===శ్రీమదాంధ్రమహాభారత రచనా ప్రశస్తి===
నన్నయ తన రచన భారతంలో అవతారికలో [[షష్ఠ్యంతములు]] వేయలేదు. [[భాస్కరరామాయణం]] ఈ విషయములో దీనిని పోలి ఉంది. స్వప్నకథను, షష్ట్యంతములను మొట్టమొదట చేర్చినవాడు తిక్కన సోమయాజి. నన్నయ తన మహాభారత రచనకి [[నారాయణభట్టు]] సహకరించాడని పేర్కొనెను.
 
వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. ఒక్కో శ్లోకానికి ఒక్కో పద్యం అన్న పద్ధతి పెట్టుకోలేదు. ’భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం’ అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే ప్రణాళికను అనుసరించి అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన [[తెలుగు]] కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.
"https://te.wikipedia.org/wiki/నన్నయ్య" నుండి వెలికితీశారు