రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

యుద్ధకాండము అందులోని ఐదు (5) ఉప ఖండముల గురించి వ్రాయ బడినది.
→‎కావ్య రచనలో తెలుగుదనం: పద్య ఛందస్సు ప్రసవాన జరిగినది
పంక్తి 75:
రామాయణ కల్పవృక్షంలో కనిపించే వాడుక నుడికారమూ, పలుకుబళ్ళూ చదివితే ఒక మహాకావ్యంలో, అందులోనూ పద్యకావ్యంలో ఇటువంటి భాషకూడా ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోతాం. ఆ భాష సందర్భోచితంగా ఉండి, గుండెకు తాకుతుంది కూడా. కల్పవృక్షంలోని తెలుగు వాడుక భాష గురించి చెప్పాలంటే, అది పీ.హెచ్.డీకి తగిన అంశమే అవుతుంది. ఈ విషయమ్మీద పుస్తకాలు కూడా వచ్చాయి. కల్పవృక్షంలోని వాడుకభాషని ఒక మూడు దృక్కోణాలనుండి పరిశీలించవచ్చు: (1) వాడుక భాషలోని సామెతలు, నుడికారము, పలుకుబడి (2) తెలుగు భాషకి ప్రత్యేకమైన వాక్యవిన్యాసం (3) తెలుగు సంభాషణల్లో కనిపించే గడుసుదనం, ఒడుపు, కాకువు. కల్పవృక్షంలో తెలుగు సామెతలు అసంఖ్యాకంగా కనబడతాయి. ఉదాహరణగా కొన్ని పద్యాలు
<poem>
ఆటవెలది:
అయినవారికేమొ ఆకులయందును,
కానివారికేమొ కంచములను
Line 93 ⟶ 94:
</poem>
ఇలాంటి వాక్య విన్యాసం ఒక్క తిక్కనలో కనిపిస్తుంది, మళ్ళా విశ్వనాథలో కనిపిస్తుంది. ఇక - తెలుగు మాటల్లో కనిపించే ఒడుపు, గడుసుదనం గురించి చెప్పాలంటే, రామాయణ కల్పవృక్షమంతా ఉదహరించాల్సిందే! ... ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ఓ పెద్ద గ్రంథమై కూర్చుంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు స్వయంగా రామాయణ కల్పవృక్షం చదివి అందులోని తెలుగుదనాన్ని, వాడుక భాష సొబగును తనివితీరా ఆస్వాదించవచ్చు.<ref>[http://www.eemaata.com/em/printerfriendly/?id=1044 "ఈమాట"లో భైరవభట్ల కామేశ్వరరావు వ్యాసం "పద్యాలు - వాడుక భాష"]</ref>
 
 
==విమర్శలు==
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు