రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

→‎కావ్య రచనలో తెలుగుదనం: పద్య ఛందస్సు ప్రసవాన జరిగినది
→‎కావ్య రచనలో తెలుగుదనం: పద్య ఛందస్సు "మత్తేభవిక్రీడితము" ప్రస్తావన జరిగినది
పంక్తి 82:
 
</poem>
మత్తేభవిక్రీడితము:
 
రామాయణ కల్పవృక్షంలో ప్రత్యేకంగా చెప్పుగోదగినవి తెలుగు వాడుకలోని పలుకుబళ్ళను యథాతథంగా పద్యాలలో పలికించడం. "గోల పెట్టు", "కిక్కురుమనలేదు", "దిమ్మెక్కి" మొదలైన పలుకుబళ్ళైతేనేమి, "రా అమ్మా", "అది కాదమ్మా" మొదలైన సంబోధనలైతేనేమి పద్యాలలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇక వాడుకభాషలోని వాక్యవిన్యాసాన్ని అలాగే ప్రయోగించిన సందర్భాలుకూడా అనేకం ఉన్నాయి. సుమంత్రుడు దశరథునితో, "నాతో రా!" అంటాడు! ఇది కందపద్య భాగం. ఇంతకన్నా వాడుకభాష మరెక్కడా ఉండదు. ఇక్కడ సందర్భం బట్టి అది ఎంతో సమంజసంగా కుదిరింది. సుమంత్రుడుకి దశరథుని దగ్గరున్న చనువు ఎంతటిదో ఇది స్పష్టం చేస్తుంది. అలాగే మిథిలకు వచ్చిన విశ్వామిత్రునితో జనక మహారాజు, "ఇది మీయిల్లు" అంటాడు. ఇంతటి వ్యావహారిక ప్రయోగం, ఒక మత్తేభ పద్యం మొదలని ఎవరైనా ఊహించగలరా! అలాగే విశ్వామిత్రుడు రాముణ్ణి తనతో పంపని దశరథుని అడిగినప్పుడు, దశరథుడు సందేహిస్తూంటే, "నీ కొడుకును గైకొని చని మా కాకలి యంచు దిందుమా, పిచ్చి నృపా!" అంటాడు. ఇలా విశ్వనాథ విశ్వామిత్రుడే అనగలడు! దశరథుడు రాముని తన వెంట పంపనన్నప్పుడు, విశ్వామిత్రుడెలా మాట్లాడతాడో చూడండి:
 
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు