గూడవల్లి రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినిమా జీవితం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశాడు → పనిచేశాడు using AWB
పంక్తి 46:
ఆయన [[మద్రాసు]] నుంచి '[[ప్రజామిత్ర]]' వారపత్రికను పదేళ్ళ పాటు నడిపాడు. ఆ రోజుల్లో మద్రాసుకు వెళ్ళే తెలుగు రచయితలు, కళాకారులకు ప్రజామిత్ర ఆఫీసే సమావేశ ప్రదేశమైంది. అంతవరకు రాజకీయ పత్రికగా నడిచే ప్రజామిత్రను సంగీత, సాహిత్య, నాటక, చిత్రకళా వ్యాసాలతో ఒక అపురూపమైన పత్రికగా రామబ్రహ్మం తీర్చిదిద్దారు. ఆయన ప్రజామిత్ర లోనే కాక సమదర్శిని, వాది లాంటి ఇతర పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వ్రాశాడు.
 
[[సముద్రాల రాఘవాచార్య]], [[కుర్రా సుబ్బారావు]]లు ఇతనికి సహాయపడుతుండేవారు. [[నార్ల వెంకటేశ్వరరావు]] గారు ఆంధ్రప్రభలో[[ఆంధ్రప్రభ]]లో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత [[ఆండ్ర శేషగిరిరావు]], [[ముద్దా విశ్వనాథం]], [[బోయి భీమన్న]]లు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.
 
[[తాపీ ధర్మారావు]], [[వేలూరి శివరామశాస్త్రి]], [[త్రిపురనేని గోపీచంద్]] మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.