"ఉన్నవ లక్ష్మీబాయమ్మ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
లక్ష్మీబాయమ్మ నడింపల్లి సీతారామయ్య రామలక్ష్మమ్మ దంపతులకు 1882లో [[గుంటూరు జిల్లా]] [[ఫిరంగిపురం]] మండలం [[అమీనాబాదు]] గ్రామంలో మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.<ref>http://www.streeshakti.com/bookL.aspx?author=3</ref> కుటుంబంలో అందరికంటే చిన్నదైన కారణంగా అభ్యుదయభావాలతో పాటు సాంప్రదాయక విద్యను అందుకున్నది. తన 10వ ఏట గుంటూరుజిల్లా [[వేములూరిపాడు]]కు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణతో 1892లో వివాహం జరిగింది.
 
1902లో ఉన్నవ దంపతులు గుంటూరుజిల్లాలో ఒక వితంతు శరణాలయం స్థాపించారు. ఎంతో సాహసంతో వితంతు పునర్వివివాహాలు జరిపించారు. ఇంతలో [[రాజమండ్రి]] నుండి [[కందుకూరి వీరేశలింగం]] పంతులు గారు ఈ దంపతుల్ని పిలిచారు. వీరేశలింగం అక్కడ స్థాపించిన ఆశ్రమం, శరణాలయ కార్యకలాపాలను ఈ దంపతులకు చూపించారు. అక్కడి వారంతా కలసి ఆశ్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వీరు పరిశీలించి ఒక్క సంవత్సరం పాటు అక్కడ గడించిన అనుభవంతో 1908లో ఉన్నవ దంపతులు [[గుంటూరు]] తిరిగి వచ్చారు. 1914నుండి స్వాతంత్య్రం సంపాదించుకోవాలనే ఆకాంక్ష భారతీయుల్లో బలంగా నాటుకుపోయింది. ఉన్నవ దంపతులతోపాటు [[అయ్యదేవర కాళేశ్వరరావు]], [[రాయప్రోలు సుబ్బారావు]], [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు వంటి స్వాతంత్ర్య సమరయోధులు తరచూ [[పొట్లపూడి]]లో సమావేశమౌతుండేవారు. స్వరాజ్య సంపాదన గురించి ఆంధ్రరాష్ర్ట నిర్మాణానికై ఆలోచనలు జరిపేవారు.
 
==శారదా నికేతన్==
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2055605" నుండి వెలికితీశారు