సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
సీతాపహరణ గురించి తెలిపి [[జటాయువు]] మరణించాడు. సీతను ఎడబాసి రాముడు దుఃఖితుడైనాడు. రామ లక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేసుకొన్నారు. సీతను వెదకడానికి సుగ్రీవుడు నలుదిక్కులా వానరులను పంపాడు. వారిలో అంగదుని నాయకత్వములో [[హనుమంతుడు]], నీలుడు, జాబవంతాదులు దక్షిణ దిశగా పయనించి సాగరతీరానికి చేరారు. సీత జాడతెలియక ఖిన్నులైన వారికి [[సంపాతి]] సీత లంకలోనున్నదని, రావణునిచే బంధింపబడినదనీ చెప్పాడు.
 
హనుమంతుడు నూరుయోజనముల సాగరమును లంఘించి లంకను చేరాడు. లంకిణిని దండించి, లంకలో జొచ్చి అంతఃపురాలూ, అన్ని భవనాలూ వెదికి సీతను కానక చింతించాడు. మరల సీతారామలక్ష్మణులకు, దేవతలకు నమస్కరించి అశోకవనంలో వెదకసాగాడు. అక్కడ శింశుపావృక్షం క్రింద సింహముల మధ్య చిక్కిన లేడివలె[[లేడి]]వలె, నివురుగప్పిన నిప్పువలె, విఘ్నములవలన భగ్నమైన సిద్ధివలె, మరచిపోయిన విద్యవలె, అసత్యాపవాదంవలన భంగపడిన కీర్తివలె, హరించుకుపోతున్న సిరివలె, దీనయై యున్న స్త్రీని చూచి 'ఈమెయే సీత' అని నిర్ధారించుకొన్నాడు.
 
రావణుడు అక్కడికి వచ్చి తనకు లొంగిపొమ్మని సీతను బెదరించాడు. సీత ఒక గడ్డి పరకను అడ్డముగా పెట్టుకొని, రావణునితో "రావణా! నన్ను కాంక్షించడం నీకు తగనిపని. ఇది నీకు, నీ వంశానికి వినాశకారకం. సూర్యునకూ కాంతికీ లాగే రామునకూ నాకూ అవినాభావ సంబంధం ఉంది. నీవు పిరికివాడివి గనుక [[రాఘవులు]] ఆశ్రమంలో[[ఆశ్రమం]]లో లేనప్పుడు నన్ను అపహరించి తెచ్చావు. రామలక్ష్మణుల బాణాలు నిన్నూ, లంకనూ నాశనం చేయడం తధ్యం. వారిని ఎవరూ అడ్డుకొనలేరు. రామునకు నన్ను సమర్పించి శరణు వేడడం ఒకటే నిన్ను రక్షింపగల మార్గం" అన్నది.
[[దస్త్రం:Lanka Dahan Hanuman.jpg|thumb|లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు]]
క్రుద్ధుడై రావణుడు ఒక నెల గడువుపెట్టి వెళ్ళిపోయాడు. మరణించవలెనని తలచిన సీతను ఓదార్చి [[త్రిజట]] తనకు వచ్చిన స్వప్నము గురించి చెప్పినది. ఆమెకు శుభములు కలుగునని, త్వరలో మంచి వార్త వినగలదని ఊరడించింది.
 
[[హనుమంతుడు]] సీతను దర్శించి, రాముని అంగుళీయకమును సమర్పించి, తను వచ్చిన వృత్తాంతము తెలిపెను. [[సీత]] [[రామ]] [[లక్ష్మణుల]] క్షేమము అడిగి, దుఃఖించింది. స్వయముగా రాముడే రావణుని జయించి తనను తీసుకొని వెళ్ళుట రామునకు తగిన పని అని చెప్పినది. హనుమంతుని ఆశీర్వదించి, ఆనవాలుగా తన చూడామణిని ఇచ్చి రామునితో తనమాటలుగా "ఒక్క నెలలోపల నన్ను విడిపించకపోయిన యెడల సీత జీవించియుండదు" అని చెప్పమన్నది.
 
హనుమంతుడు తరువాత రావణుని సభలో హెచ్చరించి, లంకను కాల్చెను. సీత దీవెనవలన తన తోక కాలినాగాని హనుమంతునకు బాధ కలుగలేదు. మరొకమారు సీతను దర్శించి, తిరుగు ప్రయాణమయ్యెను. రాముని వద్దకు వెళ్ళి "చూశాను సీతను. ఆమె నిన్నే స్మరిస్తూ ఏకవస్త్రయై కృశించి యున్నది" అని సీత సందేశాన్ని వినిపించాడు. కృతజ్ఞతతో రాముడు హనుమంతుని కౌగిలించుకొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు