బూర్గుల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
 
== సాహితీ వ్యాసంగం ==
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. పారశీక వాఞ్మయ చరిత్ర ఆయన రచనలలో పేరు పొందినది. జగన్నాథ పండితరాయల [[లహరీపంచకము]]ను, [[ఆది శంకరాచార్య|శంకరాచార్యుల]] [[సౌందర్యలహరి]], [[కనకధారా స్తోత్రం|కనకధారారాస్తవము]]ను [[తెలుగు]]లోకి అనువదించాడు. కృష్ణ శతకం, సంస్కృతంలో శ్రీ [[వెంకటేశ్వర సుప్రభాతం]], [[శారదస్తుతి]], [[గౌరీస్తుతి]], [[వాణీస్తుతి]], [[లక్ష్మీస్తుతి]], [[శ్రీకృష్ణాష్టకం]] మొదలైనవి ఆయన ఇతర రచనలు.వీరు రచించిన వ్యాసాలు 'సారస్వత వ్యాస ముక్తావళి' పేరుతో అచ్చయింది. పండిత రాజ పంచామృతం, [[కృష్ణశతకం]], [[వేంకటేశ్వర సుప్రభాతం]], నర్మద్‌గీతాలు, పుష్పాంజలి, తొలిచుక్క (కవితలు), నివేదన (కవితలు), పారశీక వాఙ్మయ చరిత్ర మొదలైన గ్రంథాలు వెలువరించడమే కాకుండా ఎన్నో కావ్యాలకు పీఠికలు రాశారు. అనువాద రచనలు కూడా చేశారు. [[వానమామలై]], [[కాళోజీ]], [[దాశరథి]], [[నారాయణరెడ్డి]] ప్రోత్సాహంతో 'తెలంగాణ రచయితల సంఘం' ఏర్పాటు చేసి సాహితీలోక ప్రసిద్ధుడయ్యారు.
 
== పురస్కారాలు ==