అయ్యంకి వెంకటరమణయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
1911లో [[విజయవాడ]]లో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డాడు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంథాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన ''గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును 'నేషనల్ లైబ్రరీ డే'గా [[భారత గ్రంథాలయ సంస్థ]] గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గ్రంథాలయ వారోత్సవము ('నేషనల్ లైబ్రరీ వీక్ ') ను నిర్వహిస్తుంది.
 
1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా]], [[గుంటూరు జిల్లాలలోజిల్లా]]లలో కార్యదర్శులు నిర్వహించారు. వీని మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ధరించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం పర్యటించాడు.
 
==గౌరవాలు==