కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
[[తెలుగు]]లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు ''విజ్ఞాన చంద్రికా మండలి'' స్థాపకుడు - '''కొమర్రాజు వెంకట లక్ష్మణరావు''' ([[మే 18]], [[1877]] - [[జూలై 12]], [[1923]]).
 
తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో[[తెలుగు]]లో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని[[తెలుగు]]జాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.
 
==సమకాలీన సాహితీ విప్లవం==
పంక్తి 32:
|align=right
}}
ఇరవయ్యవ శతాబ్దం తెలుగు సాహిత్య, సామాజిక వికాసానికి మహాయుగం. ఇంచుమించు ఒకే కాలంలో నలుగురు మహానుభావులు [[తెలుగు భాషనుభాష]]ను, [[తెలుగు జాతినిజాతి]]ని ఆధునికయుగం వైపు నడిపించారు. ఒక్క తరంలో పది తరాలకు సరిపడా ప్రగతిని తెలుగువారికి[[తెలుగు]]వారికి అందించిన [[నవయుగ వైతాళికులు]] వారు.
<ref>[http://www.archive.org/details/TeluguVaitalikuluUpanyasalaSamputamuVol1 తెలుగు వైతాళికులు - ఉపన్యాసాల సంపుటి (ఆర్కీవ్. ఆర్గ్ ప్రతి]- కొమర్రాజు లక్ష్మణరావు జీవితం - కె.రంగనాథాచార్యులు (పేజీలు 1-20)మరియు కొమర్రాజు లక్ష్మణరావు భాషా సేవ - విద్వాన్ విశ్వం.
(పేజీలు21-32)</ref>
పంక్తి 44:
[[1877]] [[మే 18]] న [[కృష్ణా జిల్లా]] [[పెనుగంచిప్రోలు]]లో లక్ష్మణరావు జన్మించాడు. ప్రముఖ రచయిత్రి [[బండారు అచ్చమాంబ]] ఆయనకు అక్క. లక్ష్మణరావు మూడవయేటనే తండ్రి మరణించాడు. సవతి అన్న శంకరరావు పోషణలో లక్ష్మణరావు తన ప్రాథమిక విద్యను [[భువనగిరి]]లో పూర్తిచేశాడు.
 
లక్ష్మణరావు మేనమామ బండారు మాధవరావు [[నాగపూరు]] (అప్పటి మధ్యప్రదేశ్‌లో భాగం, ప్రస్తుత మహారాష్ట్ర)లో ప్రభుత్వోద్యోగి. ఆయన రెండవభార్య అచ్చమాంబ. అందువలన లక్ష్మణరావు తన తల్లితో సహా నాగపూరులో మేనమామ (బావ) వద్ద చేరాడు. అక్కా,బావల వద్ద నాగపూరులో ఉంటూ [[మరాఠీ భాష]]ను నేర్చుకున్నాడు. 1900 సంవత్సరంలో బి.ఎ.పట్టా పుచ్చుకొని, తరువాత ప్రైవేటుగా చదివి, 1902లో ఎమ్.ఏ.లో ఉత్తీర్ణుడయ్యాడు. [[మరాఠీ]] భాషలో వ్యాసాలు, పద్యాలు వ్రాసాడు. [[తెలుగు]], [[మరాఠీ]], [[ఇంగ్లీషు]] మాత్రమే కాక [[సంస్కృతము]], [[బెంగాలీ]], [[ఉర్దూ]], [[హిందీ]] భాషలలోనూ ఆయన ప్రావీణ్యతను సంపాదించాడు.
 
మహారాష్ట్రలో విద్యాభ్యాసమైన తరువాత ఆయనకు మునగాల రాజా [[నాయని వెంకట రంగారావు]] సంస్థానములో ఉద్యోగము లభించింది. రాజా అభ్యుదయ భావాలు కలిగినవాడు. తెలుగు భాషాభిమాని. లక్ష్మణరావు ఉద్యోగం చేస్తూనే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించేలా తగిన విశ్రాంతిని, ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. ఆయన సఖ్యతవల్ల, కొమర్రాజుకి తెలుగు భాషాభివృద్ధికి మంచి ప్రోత్సాహము లభించింది.
 
1901లో '''[[శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం]]''', 1906 లో ''[['విజ్ఞాన చంద్రికా మండలి]]''' స్థాపించడంలో కొమర్రాజు లక్ష్మణరావు ప్రముఖపాత్ర వహించాడు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వమును తయారుచేసే మహత్కార్యాన్ని ప్రారంభించాడు.
 
ఈ శ్రమలో ఆయన ఆరోగ్యము బాగా దెబ్బ తిన్నది. [[1923]] [[జూలై 12]] న, 46 యేళ్ళ వయసులోనే కొమర్రాజు లక్ష్మణరావు మరణించాడు. [[కందుకూరి వీరేశలింగం]] పంతులు మరణించిన ఇంటిలో, అదే గదిలో లక్ష్మణరావు కూడా మరణించాడు.
 
==రచనారంభం==
మహారాష్ట్రదేశంలో ''సమాచార్'', ''వివిధ విజ్ఞాన్ విస్తార్'' అనే పత్రికలకు సంపాదకత్వం వహించాడు. ''కేసరి'', ''మహారాష్ట్ర'' వంటి పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. ప్రాచీన మహారాష్ట్ర కవి [[మోరోపంత్]] రచించిన భారతాన్ని పరిశోధించి, సరిదిద్ది శుద్ధప్రతిని తయారుచేసి కర్ణపర్వాన్ని ప్రకటించాడు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం ఇది.
 
అయినా ఆంధ్రభాషతో కాని, ఆంధ్రదేశ వ్యవహారాలతో గాని సంపర్కాన్ని కోల్పోలేదు. నాగపూరులో[[నాగపూరు]]లో ఉంటూనే [[తెలుగు]] పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు. అప్పట్లో [[విజయవాడ|బెజవాడ]] క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన రాయసం వేంకటశివుడు స్త్రీ విద్యా వ్యాప్తికోసం నడిపే "తెలుగు జనానా" పత్రికలో అచ్చమాంబ, లక్ష్మణరావులు వ్యాసాలు వ్రాసేవారు. "[[శివాజీ చరిత్రము]]" ఆయన మొదటి తెలుగు గ్రంథం. "[[హిందూ మహా యుగము]]", "[[ముస్లిమ్ మహాయుగము]]" వంటి ఆయన వ్యాసాలు తరువాత "లక్ష్మణరాయ వ్యాసావళి"<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=laqs-mand-a%20raaya%20vyaasaaval%27i&author1=raavu%20vein%27kat%27a%20laqs-mand-a&subject1=GENERALITIES&year=1950%20&language1=Telugu&pages=172&barcode=2030020024543&author2=&identifier1=&publisher1=vein%27kat%27a%20laqs-mand-a%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/658 భారత డిజిటల్ లైబ్రరీలో లక్ష్మణరాయ వ్యాసావళి పుస్తకం.]</ref> పేరుతో ప్రచురితమైనాయి.
 
==శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం==
పంక్తి 62:
==విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి==
{{main|విజ్ఞాన చంద్రికా మండలి}}
సమాజం ముందడుగు వేయాలంటే విజ్ఞానంలో అభివృద్ధి అత్యవసరమని గుర్తించి, లక్ష్మణరావు, నాయని వేంకటరంగారావు, [[గాడిచర్ల హరిసర్వోత్తమరావు]], [[అయ్యదేవర కాళేశ్వరరావు]], రావిచెట్టు రంగారావు వంటివారు 1906 లో హైదరాబాదులో [[విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి]] స్థాపించారు. అప్పటివరకు తెలుగులో రచనలు సాహిత్యానికే అధికంగా పరిమితమై ఉండేవి. అందరికీ ఆధునిక విజ్ఞానాన్ని అందించడానికి తెలుగులో[[తెలుగు]]లో విజ్ఞానశాస్త్రము, చరిత్ర వంటి విషయాలలో పుస్తకాలు ప్రచురించుట వారి లక్ష్యము. ఈ మండలి ప్రధానోద్దేశ్యము ఇలా చెప్పబడింది - ''స్వరాజ్యం కొఱకు ఆంధ్రదేశంలోను[[ఆంధ్రదేశం]]లోను, యావద్భారతంలోను కూడా గాఢ వాంఛ ప్రబలియున్నది. కులమత భేదాలు లేక యుక్తవయసు వచ్చిన ప్రతి పురుషునికి, స్త్రీకి వోటు గలిగిన స్వరాజ్యమే మన గమ్యస్థానం.....పంచముల అస్పృశ్యత రూపుమాపనిది స్వరాజ్యము రానేరదు. .... ఆంధ్ర ప్రజలకు నవీన ప్రపంచములో అత్యంతముగా వృద్ధియైన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్ధిక విజ్ఞానములనిచ్చుట ఆవశ్యకము''.
 
విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి తెలుగుదేశానికి అందించిన మొదటి పుస్తకం గాడిచర్ల హరి సర్వోత్తమరావు రచించిన "[[అబ్రహాం లింకన్]]". దీని ప్రచురణకు ప్రూఫులు దిద్దడం నుండి తొలిపలుకు వ్రాయడం వరకు చాలా భారాన్ని లక్ష్మణరావు నిర్వహించాడు.
 
మండలి ప్రచురించిన ముఖ్య గ్రంథాలలో కొన్ని ఈ పట్టికలో చూడొచ్చు<ref>{{cite book|author1=అజ్మీరు వీరభద్రయ్య|title=తెలుగు భాష, చరిత్రల పరిశోధనా పితామహుడు శ్రీ కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు జీవిత చరిత్ర|publisher=అజ్మీరు వీరభద్రయ్య}}</ref> :