కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==అవధాన ప్రస్థానం==
* 1985 సెప్టెంబరు 2,3,4 తేదీలనందు [[శృంగేరీ పీఠాధిపతి]] జగర్గురు [[భారతీ తీర్థస్వామి]] [[నల్లకుంట]]లోని శంకరమఠంలో[[శంకరమఠం]]లో శతావధానం. మూడురోజుల పాటు సాగిన ఆనాటి [[శతావధానం]]లో సర్వశ్రీ [[కేశవపంతుల నరసింహశాస్త్రి]], [[పుల్లెల శ్రీరామచంద్రుడు]], శ్రీ [[పేరాల భరత శర్మ]], [[శలాక రఘునాథశర్మ]] వంటి ఉద్దండులు పృచ్చకులుగా కూర్చోవడమేకాక ప్రతీ ప్రయోగాన్ని సునిశితంగా గమనించారు.
* 1985 నవంబర్ నెలలో [[విజయవాడ]] [[లబ్బీపేట]]లోని [[వేంకటేశ్వరస్వామి]] దేవాలయం ప్రాంగణంలో భువనవిజయ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆనాడు కుర్తాళం పీఠాధిపతి శ్రీ త్రివిక్రమానంద భారతి అధ్యక్షులుగా ఉన్నారు. సరస్వతీ కంఠాభరణ డా||ప్రసాదరాయ కులపతి సంచాలకులుగా ఉన్నారు. కడిమిళ్ళవారి అవధాన గురువులయిన శ్రీ రావూరి వేంకటేశ్వర్లుగారు ముఖ్య అతిథిగా వ్యవహరించారు. విజయవాడలో[[విజయవాడ]]లో కూడా 50 సమస్యలు 50 వర్ణనలు పూర్తిచేసి నూటికి నూరు ధారణ చేయగా అశేష ప్రజానీకం ఎంతో ఆనందించింది.
* తూర్పుగోదావరి జిల్లా [[అమలాపురం]]లో త్రివేణి ఆధ్వర్యంలో మృగశీర్ష వెంకటరమణమూర్తి, [[ద్వా.నా.శాస్త్రి|ద్వాదశి నాగేశ్వర శాస్త్రి]], కందుకూరి పుండరీకాక్షులు మొదలగువారి నేతృత్యంలో రావూరి వేంకటేశ్వర్లుగారి సంచాలకత్వంలో [[ఉషశ్రీ]] అప్రస్తుతంతో ఒక [[శతావధానం]] నిర్వహించారు. ఈ శతావధానంలో సమస్యలు 25, దత్తపదులు 25, వర్ణనలు 25, ఆశువులు 25, అనే పద్ధతిని స్వీకరించి 75 పద్యాలను ధారణచేశారు.
* రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం టౌనుహాలులో [[బేతవోలు రామబ్రహ్మం]]గారి సంచాలకత్వంలో సాయంకాలం 5:00 గంటలకు ప్రారంభించి, రాత్రి 10:00 గంటలకు ఒకే శతావధానం నిర్వహించి సభ్యులను ఆశ్చర్యపరిచారు.
* 1992 నవంబర్ 14,15 తేదీలలో పెద్దాపురంలో మరొక శతావధానం జరిగింది.
* 1995 ఫిబ్రవరి 11,12 తేదీలలో కీ||శే|| కొమ్మూరి శేషగిరి రావుగారు (గాంధీ) శ్రీ గోపాల శ్రీనివాసరావు, శ్రీ రాణి సుబ్బయ్య దీక్షితులు మొదలగువారి నేతృత్వంలో శ్రీ [[గరికిపాటి నరసింహారావు]] సంచాలకత్వంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్య కళామందిరంలో మరొక శతావధానం జరిగింది.
* 1995 ఏప్రియల్ 1,2 తేదీలలో యువనామ సంవత్సరము సందర్భంగా [[న్యూఢిల్లీ]]లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో బెనర్జి - గుమ్మి వెంగళరెడ్డిగార్ల ఆధ్వర్యంలో చక్రావధానుల కేశాప్రగడ రెడ్డప్ప ధచేజీగారి ఆర్డినేషన్ లో శతావధానం జరిగింది.
* 1995 జూలై 8,9 తారీకులలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాటి శాసనసభ్యులు శ్రీ వి.వి.ఎస్.చౌదరిగారి నేతృత్యంలో శ్రీ పున్నమరాజు ఉమమహేశ్వరరావు మొదలగు వారి కార్యనిర్వహణలో ప్రసాదరాయ కులపతి మరియు బేతవోలు రామబ్రహ్మంగార్ల సంయుక్త సంచాలకత్వంలో శతావధానంలో [[సంస్కృతం]] నుండి తెలుగునకు, తెలుగునుండి సంస్కృతానికి అనువాదాలను కూడా నిర్వహించి మెప్పు పొందారు.
* 1996 మే 29,30,31 మరియు జూన్ 1,2,3 తేదీలలో అనగా ఆరురోజులపాటు పశ్చిమగోదావరి జిల్లా [[పాలకొల్లు]] పట్టణంలో డా||కడిమిళ్ళ ద్విశతావధానాన్ని నిర్వహించి తన సామర్ధ్యాన్ని ప్రకటించుకున్నారు.
* 2000 మార్చి 4,5 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా [[ఏలూరు]] పట్టణంలో అవధాన భోజశ్రీ వడ్డి శ్యామసుందరరావు నేతృత్యంలో గరికిపాటి ఆర్ట్స్ ధియేటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ గరికిపాటి కాళిదాసు నిర్వహణలో శివరాత్రి మహాపర్వ సందర్భంగా మరొక శతావధానం
* 2001 ఆగష్టు 11,12 తేదీలలో అవధాన భారతి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ [[కొత్తపల్లి సుబ్బారాయుడు]], కొత్తపల్లి జానకీరామ్ గార్ల నేతృత్వంలో, కొప్పర్తి వేణుగోపాల్, డా||అరిపిరాల నారాయణరావు, చక్రావధానుల రెడ్డెప్ప ధవేజి మొదలగువార్ల కార్యనిర్వహణలో పశ్చిమగోదావరి జిల్లా [[నరసాపురం]] వై.యన్.కళాశాల ఆడిటోరియంలో సంస్కృతాంధ్ర శతావధానం జరిగింది.
===జంట అవధానాలు===
* 2002 నవంబర్ 9,10 తేదీలలో పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లి గూడేంలో తెలుగు సాహిత్య సమాఖ్య మరియు శ్రీ వడ్డి శ్యామసుందరరావు గార్ల నేతృత్వంలో నెమ్మలూరు సత్యనారాయణ మూర్తి, కొత్తపల్లి ఉదయబాబు, భారతం శ్రీమన్నారాయణ, ఆకాశం అప్పల నరసింహమూర్తి గార్ల కార్యనిర్వహణలో జరిగిన శిష్యుడు [[కోట వేంకట లక్ష్మీనరసింహం]]తో కలిసి జంటకవుల శతావధానం.
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు