ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కి → కి (3), తో → తో using AWB
పంక్తి 39:
శ్రీమతి డాక్టర్ '''ఉమా రామారావు''' కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు మరియు రచయిత్రి. 1985 లో [[హైదరాబాదు]]లో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య మరియు రూపక అకాడమీ 2003 లో ఉమా రామారావుని సంగీత్-నాటక్ అకాడమీ అవార్డుతో సత్కరించినది.
==పుట్టు పూర్వోత్తరాలు==
4-జూలై-1938 న "ఉమా మహేశ్వరి" డా. శ్రీ వి.వి. కృష్ణారావు, [[వడ్డాది సౌభాగ్య గౌరి|శ్రీమతి సౌభాగ్యం]] లకు [[విశాఖపట్టణం]]లో జన్మించినది. సాహిత్యం, సంగీతం మరియు నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య [[పి.వి.నరసింహా రావు]], పద్మశ్రీ డా. [[నటరాజ రామకృష్ణరామకృష్]]ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై మరియు గురు సి.ఆర్. ఆచార్యల వద్ద [[కూచిపూడి]], [[భరతనాట్యం]] మరియు ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించినది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక మరియు ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.
 
తొలినాళ్ళలో సోదరి [[సుమతీ కౌశల్‌]]తో బాటు పలు సంధర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణలో ప్రదర్శనలు చేసినది. 1953-55 లలో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సాంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు