భూమధ్య రేఖ: కూర్పుల మధ్య తేడాలు

"Equator" పేజీని అనువదించి సృష్టించారు
"Equator" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 13:
 
భూమి కచ్చితమైన గోళాకారంలో కాక, భూమధ్య రేఖ వద్ద కొద్దిగా ఉబ్బి ఉంటుంది. భూమి సగటు వ్యాసం 12,750 కి.మీ. కానీ భూమధ్య రేఖ వద్ద వ్యాసం, ధ్రువాల వద్ద కంటే 43 కి.మీ. ఎక్కువగా ఉంటుంది.<ref name="National">{{cite web|url=http://education.nationalgeographic.com/education/encyclopedia/equator/?ar_a=1|title=Equator|date=|accessdate=29 May 2013|publisher=National Geographic - Education|author=|work=}}</ref>
 
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కౌరూ వంటి ప్రదేశాలు అంతరిక్ష రేవులకు అనువైనవి. ఇతర అక్షాంశాల్లో కంటే ఇక్కడ, భ్రమణ వేగం ఎక్కువగా ఉండడంతో, అది అంతరిక్ష నౌక వేగానికి తోడవుతుంది. దీంతో నౌకను ప్రయోగించేందుకు తక్కువ ఇంధనం అవసరమవుతుంది. భూమి పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది కాబట్టి,  నౌకను కూడా తూర్పు దిశగానే ప్రయోగిస్తే, భూభ్రమణ వేగాన్ని వాడుకోవచ్చు. కనీసం ఆగ్నేయ, ఈశాన్య దిశల్లోనైనా ప్రయోగించాలి.
 
== భూమధ్య రేఖ వద్ద ఋతువులు, శీతోష్ణస్థితి ==
[[దస్త్రం:Seasons.svg|కుడి|frame|<br>
Diagram of the seasons, depicting the situation at the December solstice. Regardless of the time of day (i.e. the [[భూమి|Earth]]'s rotation on its axis), the North Pole will be dark, and the South Pole will be illuminated; see also arctic winter. In addition to the density of incident light, the dissipation of light in the [[భూమి వాతావరణం|atmosphere]] is greater when it falls at a shallow angle.]]
భుమిపై ఋతువులు ఏర్పడడానికి సూర్యుని చుట్టూ భూపరిభ్రమణము, భూభ్రమణాక్షానికి భూపరిభ్రమణతలానికీ మధ్య ఉన్న కోణమూ కారణాలు. ఏడాది కాలంలో కక్ష్యలో భూమి స్థానాన్ని బట్టి, ఉత్తర దక్షిణార్థ గోళాలు సూర్యుని వైపుగాని, సూర్యుని నుండి దూరంగాగానీ వంగి ఉంటాయి. సూర్యుని వైపు తిరిగి ఉన్న భాగం అధిక సూర్యకాంతిని పొందుతుంది. ఆ సమయాంలో  అది వేసవి కాలంలో ఉన్నట్లు. అవతలి వైపు ఉన్న భాగం తక్కువ సూర్యకాంతిని పొందుతుంది. అది శీతాకాలంలో ఉంటుంది. (ఆయనం చూడండి).
 
[[విషువత్తు|విషువత్తులలో]] భూమి అక్షం సూర్యుని వైపు వంగి ఉండదు; అది సూర్యునికి లంబకోణంలో ఉంటుంది. దానర్థం, భూగోళం యావత్తూ పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. 
 
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఋతువుల మధ్య భేదాలు పెద్దగా ఉండవు. ఏడాది పొడుగూతా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి— [[దక్షిణ అమెరికా]], [[ఆఫ్రికా|ఆఫ్రికాల్లోని]] ఎత్తైన పర్వతాలను మినహాయించి. ([[ఆండీస్ పర్వతాలు]], [[కిలిమంజారో పర్వతం|కిలిమంజారో పర్వతాన్ని చూడండి]]) [[వర్షం|వర్షాల సమయంలో]] భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. ఉష్ణదేశాల్లోని ప్రజలు రెండే ఋతువులను పరిగణిస్తారు: వర్షాకాలం, వేసవికాలం. కానీ భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న అనేక ప్రదేశాలు సముద్రంపై గానీ, ఏడాదంతా వర్షయుతంగా గానీ ఉన్నాయి. భూమినుండి ఈ ప్రదేశాలు ఉన్న ఎత్తును బట్టి గాని, సముద్రానికి ఉన్న సామీప్యతను బట్టి గానీ ఇక్కడి ఋతువులు ఉంటాయి.
 
భూమధ్య రేఖ చాలా వరకు మూడు మహా సముద్రాల గుండా పోతుంది. అవి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు. భుమధ్య రేఖపై ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశం 4,690 మీ. ఎత్తున {{Coord}}, వద్ద ఉంది. ఇది ఈక్వడార్ లో వోల్కన్ కయాంబే దక్షిణ సానువుల్లో ఉంది. ఇది మంచు పడే స్థాయికంటే కొద్దిగా పైన ఉంటుంది. ఈక్వడార్ మొత్తమ్మీద, మంచు నేలపైనే ఉండే ప్రాంతం అదొక్కటే. భూమధ్య రేఖ వద్ద మంచు పడే స్థాయి ఎవరెస్టు పర్వత స్థాయి కంటే 1,000 మీ. తక్కువ, ప్రపంచంలోని అత్యున్నత మంచు స్థాయి కంటే 2,000 మీ. తక్కువ. 
 
== భూమధ్య రేఖ వద్ద ఉన్న దేశాలు, ప్రాంతాలు ==
"https://te.wikipedia.org/wiki/భూమధ్య_రేఖ" నుండి వెలికితీశారు