దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ప్రతిష్ట → ప్రతిష్ఠ (3) using AWB
పంక్తి 17:
 
==బాల్యం, విద్యాభ్యాసం==
ఈయన స్వగ్రామం. [[కృష్ణా జిల్లా]], [[నాగాయలంక]] మండలం (దివిసీమ) లోని భావదేవరపల్లి గ్రామం . అయితే [[బందరు]]లో [[1872]], [[అక్టోబరు 10]] న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసానంతరం. 1886 లో తిరుపతి వెళ్ళి మహంతు పాఠశాలలో కొంతకాలం చదివారు. సంస్కృత భాషాధ్యయనం పూర్తి చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. ఆ సందర్భంలోనే సాటి ప్రజల ఆరోగ్య సమస్యలను అవగాహన చేసుకొని వైద్య పరిశోధనల ల్పట్ల మక్కువ పెంచుకున్నారు. సామాజిక సేవకు ప్రాచీన హిందూ సంప్రదాయ వైద్య విధానమే ఉత్తమమని నిర్థారణకు వచ్చారు.
 
==పరిశోధనలు==
[[కర్ణాటక]] రాష్ట్రం చేరి, మైసూరులోని సంస్కృత కళాశాలలో చేరి, ఆయుర్వేద వైద్య విద్యార్థిగా విద్యాభ్యాసం చేశారు. ప్రాచీన హిందూ వైద్య శాస్త్రాలలో ప్రధాన విభాగంగా రూపొందింన ఆయుర్వేద వైద్య చికిత్సా శాస్త్రమును ఆపోసన పట్టారు. 1893 లో వైద్య విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని రెండేళ్ళపాటు విస్తృతంగా దేశపర్యటనలు చేశారు. పర్యటనలు చేస్తూనే నగరాలలోని, కుగ్రామాలలోని భిషగ్వర్యులను శుశ్రూషతో సేవించి, వైద్య పరిశోధనలు చేశారు.