దీవి గోపాలాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
దేశీయ ఆయుర్వేద వైద్యానికి ప్రాచుర్యం తీసుకు రావాలనే మహదాశయంతో "ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల"ను ఏర్పాటు చేసి వివిధ భారతీయ భాషలలోని ప్రాచీన గ్రంథాలను సేకరించి, ఎంతో అరుదైన వాటిని అనువదింపజేశారు. ఈ గ్రంథమాల నుంచి దాదాపు 22 అతి ముఖ్యమైన వైద్య శాస్త్ర గ్రంథాలు వెలువడినాయి. వీటిలో మాధవ నిదానం, అర్క ప్రణాళిక, ఆయుర్వేద వైద్య పరిభాష, రస ప్రదీపిక, భేషకల్పం మొదలైన శీర్షికలతో ప్రాచీన హిందు వైద్య గ్రంథాలకు తెలుగులో చక్కని వ్యాఖ్యానాలు జోడించి, వివరించారు.
 
ఆయుర్వేద వైద్య చికిత్సకు దేశస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అపర ధన్వంతరిగా[[ధన్వంతరి]]గా పేరు సంపాదించారు. ఆధునిక కాలంలో ఆయుర్వేద వైద్య చికిత్సకు పునరుజ్జివం కల్పించారు. యావన్మందికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, వివిధ రుగ్మతలను, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే ఎన్నో రకాల మందులను అద్భుత శైలిలో ఆవిస్కరించి, చిరకీర్తిని పొందారు.
 
==వైద్యసేవలకు గుర్తింపు==
ఈయన వైద్య సేవలు గుర్తింపు పొందగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈయనకు అపూర్వమైన ఘన సన్మానాలు చేశారు. నాసిక్ (ప్లేగు వ్యాధితో అట్టుడికి పోయిన పట్టణం) లో "ఆయుర్వేద మార్తాండ", కలకత్తాలో "భిషజ్ఞణి" బిరుదులు అందుకున్నారు (1907), అయిదవ జార్జి బ్రిటీష్ పాలక ప్రభుత్వం తరపున "వైద్యరత్న" బిరుదును అందించి (1913) ప్రతిష్ఠాత్మక గౌరవ మన్ననలు అందించారు.