ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు.
==ఆయన రచనల విశిష్టత==
బాల సరస్వతి రచనలలో యాదవ [[ రాఘవ పాండవీయము]] తెనుగు నందలి త్ర్యర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న [[యక్ష గానముయక్షగానము]]లతో నొకటియై నాటక ముల కుప లక్షణగ నున్నది. ఆయన [[ ఆంధ్ర శబ్ద చింతామణి]] ని తెలుగు వివరణమును గూడా రచించెను. వీనిని బట్టి చూడ అతనీ ప్రబంధ, ద్వ్యర్థి కావ్య, కావ్యాలంకార సంగ్రహములను రచించిన భట్టుమూర్తితో సరిపోల్చ వచ్చును.
 
ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి,సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.
"https://te.wikipedia.org/wiki/ఎలకూచి_బాలసరస్వతి" నుండి వెలికితీశారు