నెల్లుట్ల రమాదేవి: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
| footnotes =
}}
'''నెల్లుట్ల రమాదేవి''' తెలుగు [[కవయిత్రి]], కథకురాలు, ఉపన్యాసకురాలు మరియు కార్టూనిస్టు. <ref>[http://soyi.discover-telangana.org/2007/06/north_telangana_story_writers_2/ ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2]</ref>ఆమెకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]</ref>ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె కథలు, కవిత్వం రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించారు.
==జీవిత విశేషాలు==
రమాదేవి [[వరంగల్‌]] లోని [[స్టేషన్‌ఘన్‌పూర్‌]] లో రామచంద్రరావు,శకుంతలాదేవి దంపతులకు జన్మించారు.తండ్రి వ్యవసాయం చేయిస్తూ కరణంగా ఉండేవారు. ఆమె పాఠశాల విద్యను స్టేషన్‌ఘన్‌పూర్‌లో పూర్తిచేసారు.బాల్యం నుండి ఆమెకు మిమిక్రీ అంటే ఆసక్తి ఎక్కువ. చదువు విషయంలో ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించేది. ఆమె తల్లి పుస్తకాలు, [[నవల]]లు బాగా చదివేది. పిల్లలను కూడా చదివేందుకు ప్రోత్సహించేది. పత్రికలలో గల కార్టూన్లు చూసి ఆసక్తి కనబరచేవారు. ఇంటర్ చదువుతున్నప్పుడు మొదటిసారి కార్టూన్ వేసారు. 1978 లో ఆమె మొదటి కార్టూన్ [[స్వాతి]] పత్రికలో అచ్చువేయబడినది. ఆమె కళాశాల విద్య [[హైదరాబాదు]]లోని [[రెడ్డి మహిళా కళాసాల]]లో జరిగింది.
==కార్టూనిస్టుగా==
ఆమె ఎన్నో కథలు, కవితలు రాశారు. కాని నన్ను ఆమె కార్టూనిస్టుగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు. ఎందుకంటే కార్టూన్‌ వేసేటపుడు దైనందిన జీవితంలో జరిగే విషయాలే ప్రేరణ కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో, వివాహాలలో చాలా హాస్య విషయాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటికి కాస్త అతిశయోక్తి జోడిస్తే హాస్యం, వ్యంగ్యం ఉంటుంది. కథ, వ్యాసం, కవిత ఇవన్నీ చెప్పే విషయాలనే ఒక చిన్న స్థలంలో[[కార్టూన్‌]] ద్వారా చెప్పవచ్చనేది ఆమె భావన.
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2057705" నుండి వెలికితీశారు