రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
===సంగీత సాహిత్యాలు===
[[బొమ్మ:Rallapallianantakrishnasarma.jpg|thumb|right|200px|రేఖాచిత్రం]]
చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద 'శాకుంతలం', 'ఉత్తరరామ చరిత్ర', 'ముద్రా రాక్షసం', అనర్ఘరాఘవం', 'కాదంబరి' వాటిని చదివాడు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. 'నిగమశర్మ అక్క', 'నాచన సోముని నవీన గుణములు', 'తిక్కన తీర్చిన సీతమ్మ', 'రాయలనాటి రసికత' అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. [[కట్టమంచి రామలింగారెడ్డి]] గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలను మొదలుపెట్టాడు. [[కాళిదాసు]] రచించిన [[రఘువంశం]] ఆంధ్రీకరించాడు. 'పెద్దన పెద్దతనము' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు.
 
సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయసంగీతాన్ని అభ్యసించారు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]] కార్యనిర్వహణాధికారి [[చెలికాని అన్నారావు]] తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. [[రేడియో]] కు '[[ఆకాశవాణి]]'యని పేరు పెట్టినది ఆయనే.