సంధ్యావందనం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''సంధ్యావందనం శ్రీనివాసరావు''' దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి విద్వత్ గాయకుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[అనంతపురం]] జిల్లా [[పెనుకొండ]]లో [[1918]], [[ఆగష్టు 21]]న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=19834| మా వ్యాసకర్తలు - [[భారతి (మాస పత్రిక)]] - సంపుటము 40 సంచిక 2- ఫిబ్రవరి 1963 - పేజీ100] </ref>. ఇతని తల్లిదండ్రులు దాసకూట పరంపరకు చెందినవారు. ఇతని పూర్వీకులు [[మైసూరు]] సమీపంలోని [[శ్రీరంగపట్టణం]]లో నివసించేవారు. ఇతడు [[దత్తమండల కళాశాల]]లో బి.ఎ.చదివాడు. తరువాత బి.ఎల్. కూడా చదివాడు. వకీలుగా[[వకీలు]]గా కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. అనంతపురం కలెక్టర్ ఆఫీసులో కొంతకాలం గుమాస్తాగా పనిచేశాడు. ఇతడి భార్యపేరు సరస్వతి. ఇతనికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె కలిగారు.
 
==సంగీత రంగంలో కృషి==
ఇతడు సంగీతంలో ప్రాథమిక పాఠాలు పల్లవి పక్క హనుమంతాచార్, తిరుపతి రంగాచార్యులు, చిలమత్తూరు రామయ్యల వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు టైగర్ వరదాచారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, [[ద్వారం వేంకటస్వామినాయుడు]], మైసూరు వాసుదేవాచార్‌ల వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాడు. శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలు సేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశాడు.ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, సంస్కృతము, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇతడు కళ్యాణి, యదుకుల కాంబోడి, భైరవి, కేదారగౌళ, సహన, ద్విజవంతి మొదలైన రాగాలలో విశేషమైన కృషి చేశాడు. ఇతడు తన 12వ యేటి నుండే కచేరీలు ఇవ్వడం ప్రారంభించి సుమారు 6 దశాబ్దాల కాలం దేశం అంతటా సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు ఆకాశవాణి విజయవాడ,మద్రాసు కేంద్రాలలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిగా మరియు వివిధ హోదాలలో పనిచేశాడు. ఇతడు చక్కటి కర్ణాటక బాణీలో గానం చేసి భక్తిరంజని కార్యక్రమాలను నిర్వహించాడు. ఆకాశవాణిలో అనేక వాద్యగోష్టులను నిర్వహించాడు. [[మద్రాసు]]లోని సంగీత ఉపాధ్యాయుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా కుడా పనిచేశాడు.